వైసీపికి మ‌రో షాక్

Published : Aug 16, 2017, 07:08 PM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
వైసీపికి మ‌రో షాక్

సారాంశం

టీడీపీలో చేరనున్న కాంగ్రెస్ మాజీ ఎంపీ గంగుల ప్రతాప రెడ్డి మొదట వైసీపిలోకి వస్తారని అనుకున్నారు. కాని చివరకు టీడీపీకి మారనునున్నట్లు సమాచారం. 

వైసీపి పార్టీకి మ‌రో షాక్ త‌గిలింది. మాజీ ఎంపీ గంగుల ప్ర‌తాప్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడుతున్న‌ట్లు స‌మాచారం. ఆయ‌న మొద‌ట వైసీపిలో చెరుతార‌ని అంద‌రు భావించిన చివ‌ర‌కు టీడీపీలో చేరుతున్న‌ట్లు తెల‌స్తుంది. గంగుల‌ ఇప్ప‌టికే టీడీపీలో చేరే విష‌య‌మై ఈ రోజు మంత్రి అచ్చెన్నాయుడితో కాసేపు చ‌ర్చించారు. అనంత‌రం ఇరువురు క‌లిసి కాసేపట్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ముఖ్య‌మంత్రి, టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడిని క‌ల‌వ‌నున్నారు.

 ప్ర‌స్తుతం చంద్ర‌బాబు అమ‌రావ‌తిలోని స‌చివాల‌యంలో అధికారుల‌తో చ‌ర్చిస్తున్నారు. అచ్చెన్నాయుడితో కలిసి స‌చివాలయంలో ఉన్న చంద్ర‌బాబు నాయుడి వ‌ద్ద‌కు ప్ర‌తాప్ రెడ్డి బ‌య‌లుదేరారు. టీడీపీలో చేరే అంశంపై ఆయ‌న చంద్ర‌బాబుతో చ‌ర్చించ‌నున్న‌ట్లు స‌మాచారం. గంగుల‌కు వైసీపి నంద్యాల సీటు ఇస్తే వైసీపిలోకి మారాల‌ని భావించారు. ఆ దిశ‌గా మొద‌ట ప్ర‌య‌త్నాలు కూడా జ‌రిగాయి, కానీ చివ‌ర‌కు శిల్పామోహాన్ రెడ్డికి సీటును కేటాయించిన విష‌యం తెలిసిందే.  ఇప్పుడు గంగుల వైసీపి పార్టీ నంద్యాల సీటు ఇస్తుంద‌ని భావించిన ఇవ్వ‌క‌పోవ‌డంతో ఆయ‌న పార్టీ మారనున్నార‌ని తెలుస్తుంది. చంద్ర‌బాబును క‌లిసి అనంత‌రం ఆయ‌న నిర్ణ‌యం తీసుకొనున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Food Commission Motivation:చదువు అనే ఆయుధంతో పేదరికానికి పులిస్టాప్ పెట్టొచ్చు | Asianet News Telugu
Sujana Choudhary: ఎన్టీఆర్ జిల్లా డ్రగ్స్ పై దండయాత్ర 2.0 | Drugs Awareness | Asianet News Telugu