
కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో తన మనుగడ కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. అందుకే నంద్యాల ఉప ఎన్నికల్లో పోటీకి దిగిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా మరో ప్లాన్ తో పావులు కదుపుతుంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా పై వైసీపి, తెదేపా పార్టీలు కేంద్రాన్ని నిలదీయాలని కాంగ్రెస్ కొరుతుంది.
రాష్ట్రానికి ప్రత్యేకహోదాపై 24 గంటల్లోగా కేంద్రాన్ని నిలదీయాలని, లేకపోతే తెదేపా, వైకాపాలను బహిష్కరించాలని నంద్యాలలో ప్రచారం ప్రారంభిస్తామని తెలిపారు, ఆ పార్టీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ప్రతిపక్ష నేత జగన్ ఇరువురు కుమ్మకై రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం వద్ద తాకట్టు పెట్టారని ఆరోపించారు. బాబు, జగన్ లకు తమ సొంత ప్రయోజనాలు తప్ప రాష్ట్ర అభివృద్ది పట్టదని విమర్శించారు. వారు కేంద్రం వద్ద మెప్పు కోసం రాష్ట్ర ప్రజల హక్కులను కేంద్రానికి రాసిచ్చారని ఆయన ఎద్దేవా చేశారు. తక్షణమే వారు ప్రత్కేక హోదా పై కేంద్రాన్ని నిలదీయాలని, లేకపోతే ప్రజలు తప్పకుండా రెండు పార్టీలకు ఉప ఎన్నిక లో ఓటమీ తప్పదని తెలిపారు.