
బాలయ్య జగన్ పై చేసిన వ్యాఖ్యలకు వైసీపీ ఎమ్మెల్యే రోజా స్పందించారు. బాలకృష్ణ చాలా అమాయకుడని వ్యంగంగా మాట్లాడారు రోజా. బాలకృష్ణ నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా సాక్షి పత్రిక, టీవీ ఛానెల్ ఎవరివో చెప్పాలని, తనకు మీడియా లేదని జగన్ అసత్య ప్రసారం చేస్తున్నారంటూ ఆయన కామెంట్ చేశారు. అయితే బాలయ్య వ్యాఖ్యలపై రోజా తిప్పికోట్టారు.
చంద్రబాబు రాసిన స్క్రిప్టును బాలకృష్ణ చదువుతున్నారని అన్నారు రోజా. బాలకృష్ణ మాటలు మాటలు చూస్లుంటే ఏమీ తెలియని అమాయకుడిలా ఉన్నాయని ఎద్దేవా చేశారు రోజా. చంద్రబాబు రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. బాబు ఎన్నికల సమయంలో 600 హామీలు ఇచ్చినా అందులో ఒక్కటి కూడా నెరవేర్చని ఘనత చంద్రబాబుదని ఆమె ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలోనే ప్రజలను ప్రేమించే వ్యక్తి చంద్రబాబు అని, ఏరు దాటేంత వరకు ఏటి మల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్నఅన్నట్టుగా చంద్రబాబు తీరు ఉందని విమర్శించారు. అందుకే ఈ ఎన్నికల్లో బాబుకు తగిన బుద్ది చెప్పాలని ఆమె పిలుపునిచ్చారు. నంద్యాల ఎన్నికను 2019 ఎన్నికలకు సెమీ ఫైనల్ గా రోజా పెర్కొన్నారు. పెద్దకొట్టాలలో నిర్వహించిన రోడ్ షో లో రోజా, ఎంపీ బుట్టా రేణుక పాల్గొన్నారు.