
టెక్నాలజీ పెరిగిపోతోంది. ఈ టెక్నాలజీ ఉపయోగించి మనిషి ఎన్నో కష్టమైన పనులు సులభంగా చేయగలుగుతున్నాడు. ఎన్నో వేల కిలోమీటర్ల అవతల ఉన్న వ్యక్తితో కూడా క్షణాల్లో మాట్లాడగలుగుతున్నాం. భూమిపై నుంచి అంతరిక్షంలో ఏం జరుగుతుంతో చూడగలుగుతున్నాం. ఇలా ఒకటేమిటి చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఈ పెరిగిన టెక్నాలజీ ఫలాలు ఇప్పుడు అందరికీ అందుతున్నాయి. సామాన్యుడు కూడా ఈ పెరిగిన టెక్నాలజీని ఉపయోగించుకొని సౌకర్యవంతమైన జీవితం గడపగలుగుతున్నాడు.
నిరుద్యోగులకు తీపికబురు: రెవెన్యూ, దేవాదాయ శాఖల్లో పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్
పెరిగిన హోం డెలివరీ సిస్టమ్..
ఇంతకు ముందు మనకు ఏదైనా వస్తువు కావాలంటే ఏం చేసేవాళ్లం. ఆ వస్తువు ఎక్కడ ఉంటుందో తెలిసుకొని ఆ ప్రాంతానికి వెళ్లి దానిని కొనుగోలు చేసి తీసుకొచ్చుకునేవాళ్లం. అక్కడికి వెళ్లలేని సందర్భంలో ఆ ప్రాంతంలో మనకు తెలిసిన వారిని సంప్రదించి వారితో మనకు అవసరమైన వస్తువు కొనుగోలు చేయించి కొరియర్ ద్వారా తెప్పించుకునే వాళ్లం. కొరియర్ సర్వీస్ అందుబాటులో లేని సమయ్యాల్లో అయితే ఆ వ్యక్తి ప్రత్యేకంగా ఆ వస్తువును తీసుకురావాల్సి ఉండేది. అయితే పెరిగిన టెక్నాలజీ ఈ అసౌకర్యాన్ని రూపుమాపింది. ఇప్పుడు మనకు ఏది కావాలన్న క్షణాల్లో దానిని ఆర్డర్ పెట్టేయొచ్చు. ఒకటి రెండు రోజుల్లో ఆ వస్తువు మన చేతికి వచ్చేస్తుంది. అయితే ఇటీవల కాలంలో తినే ఫుడ్ కూడా ఇంటికి వచ్చేస్తోంది. హైదరాబాద్ తో పాటు చిన్న చిన్న నగరాల్లో కూడా ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చేస్తోంది. మన చేతిలో ఉన్న యాప్ సహాయంతో ఇష్టమొచ్చిన ఫుడ్‌ను, ఇష్టమొచ్చిన రెస్టారెంట్ నుంచి ఆర్డర్ పెట్టేయొచ్చు. ఈ హోం డెలివరీ సిస్టమ్ ఇన్ని రోజులు ఫుడ్, బుక్స్, ఫర్నీచర్, మెడిసిన్, ఇతరత్రా వస్తువులకు మాత్రమే ఉండేది. అయితే ఇప్పుడు మనకు ఎంతో అవసరమైన ఓ ఇంధనం కూడా మన ఇంటికే రాబోతోంది..
ప్రాణాలకు ముప్పు: వంగవీటి రాధాకు చంద్రబాబు ఫోన్, ప్రభుత్వానిదే బాధ్యత
బీపీసీఎల్ యాప్ ద్వారా..
ఇప్పుడు పెట్రోల్, డీజిల్ కూడా నిత్యవసర వస్తువుగా మారిపోయింది. అయితే మనకు ఈ ఇంధనాలు కావాలంటే కచ్చితంగా కచ్చితంగా పెట్రోల్ బంక్ కే వెళ్లాలి. అయితే ఇక నుంచి ఆ కష్టం తీరిపోనుంది. పెట్రోల్, డీజిల్ అవసరమైన వారికి ఇక హోం డెలివరీ సదుపాయం అందుబాటులోకి రానుంది. దీనిని మంగళవారం రోజు విజయవాడలో ప్రయోగాత్మకంగా అమలు చేశారు. దీని కోసం బీపీసీఎల్ అనే యాప్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ యాప్ ద్వారా పెట్రోల్, డీజిల్ ఆర్డర్ పెట్టిన వారికి హోం డెలివరీ చేయనున్నారు. ఇలా డెలివరీ చేసే సమయంలో ప్రమాదం జరగకుండా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఫెసో క్యాన్ ను ఉపయోగించనున్నారు. ఇది ఇప్పుడు ప్రస్తుతం విజయవాడ నగరం పరిధిలో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే అన్ని మేజర్ సిటీస్‌లో దీనిని అమలు చేయనున్నారు. విజయవాడలోని గాంధీనగర్ పెట్రోల్ పంప్‌లో మంగళవారం ఈ హోం డెలివరీ సిస్టమ్‌ను బీపీఎల్ సౌత్ డీజీఎం ప్రారంభించారు. ఇది ప్రస్తుతం విజయవాడ పట్టణవాసులకు అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. బీపీసీఎల్ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకొని ఈ సౌకర్యం పొందవచ్చని సూచించారు. ఈ హోం డెలవరీ సిస్టమ్ తో పాటు ఫారెన్ లో అమలవుతున్న మరో సిస్టమ్ ను కూడా మంగళవారం ప్రారంభించారు. పెట్రోల్ పంప్ ఉద్యోగులెవరీతో సంబంధం లేకుండా డెరెక్ట్ గా వినియోగదారుడే బంక్‌లో పెట్రోల్ కొట్టించుకోవచ్చు. యాపీఐ పేమెంట్స్ యాప్స్ ద్వారా అక్కడ ఉన్న స్కానర్ ను స్కాన్ చేసి డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఆర్టీఫిషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా ఈ కొత్త సిస్టమ్ పని చేయనుంది.