
అనంతపురం : జీవితాంతం కలిసి నడవాల్సిన భర్త, అపురూపంగా పెంచుకున్న బిడ్డ.. కళ్లముందే నిర్జీవంగా కనిపించారు. అప్పటివరకు తనతో ముచ్చట్లు చెప్పిన వారిద్దరూ కళ్ళు తెరిచి చూసేలోపే లోకాన్ని వీడారు. దీంతో ఆ మహిళ శోకసంద్రంలో మునిగిపోయింది. తన వాళ్ళని తలచుకుంటూ బోరున విలపించింది. వివరాల్లోకి వెళితే… పరశురాముడు (44) భాగ్యమ్మ దంపతులు నగరంలోని ఉమా నగర్ లో నివాసం ఉంటున్నారు. హేమంత్ కుమార్ (17), కొండప్ప ఇద్దరు సంతానం. పరశురాముడు బేల్దారి పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు.
మంగళవారం పరశురాముడు, భాగ్యమ్మ, పెద్ద కుమారుడు హేమంత్ కుమార్ తో కలిసి పంపనూరు templeకి బైక్ మీద వెళ్లారు. దైవ దర్శనం తరువాత ముగ్గురు స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. వీర బైక్ కురుగుంట సమీపంలోకి రాగానే ఓ ఐచర్ వాహనం Wrong routeలో వేగంగా ఎదురుగా వచ్చి ఢీకొట్టింది.
దీంతో ఒక్కసారిగా పరశురాముడు, భాగ్యమ్మ,హేమంత్ కుమార్ ఎగిరిపడ్డారు. తీవ్రంగా గాయపడిన పరశురాముడు, హేమంత్ కుమార్ అక్కడికక్కడే death అయ్యారు. చెందగా భాగ్యమ్మ కంటికి తీవ్ర గాయమైంది.
ఎంతపని చేశావయ్యా…
కళ్ళు మూసి తెరిచే లోపే జరిగిపోవడం, భర్త, కుమారుడు విగతజీవులుగా కనిపించడం చూసి.. భాగ్యమ్మ బోరున విలపించింది. ‘ ఒరేయ్ హేమంతూ లేవరా..? అయ్యా లేవు ఇంటికి వెళ్ళాం’ అంటూ వారిని తడుతూ, లేపుతూ విలపిస్తున్న భాగ్యమ్మను చూసి సంఘటనా స్థలంలోని వారంతా కంటతడి పెట్టారు.
అనంతపురం రూరల్ స్టేషన్ మహానంది, ఏఎస్ఐ వెంకటేష్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. భాగ్యమ్మను ఆసుపత్రిలో చేర్పించి కేసు నమోదు చేశారు. బైక్ ను రాంగ్రూట్లో ఢీకొట్టిన డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా వెళ్లిపోగా పోలీసులు వాహనం కోసం ఆయా ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు.
మా నాన్న రెక్కీ చేశాడనేది అబద్ధం.. ఆయన ఆరోగ్యం బాలేదు.. : అరవ సత్యం కొడుకు చరణ్ తేజ (వీడియో)
కాగా, డిసెంబర్ 9న గుంటూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధురాలు మరణించింది. ఆమెకు దిక్కూ మొక్కు లేరు. కనీసం వుండడానికి ఇళ్లు కూడా లేదు. దీంతో రోడ్డుపక్కనే జీవనం సాగిస్తున్న ఆ అభాగ్యురాలు బుధవారం రాత్రి ప్రమాదానికి గురయి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిపోయింది. ఈ దుర్ఘటన guntur district సత్తెనపల్లిలో చోటుచేసుకుంది.
సత్తెనపల్లి లో ఓ వృద్దురాలు రాత్రి రోడ్డుపక్కన నిద్రిస్తుండగా గుర్తుతెలియని కారు డీకొట్టింది. రాత్రి సమయంలో అతివేగంతో వచ్చిన కారు ఆమె పైనుండి దూసుకెళ్లింది. ప్రమాదం తర్వాత కారు ఆగకుండా అదే వేగంతో వెళ్ళిపోయింది.
ఈ ప్రమాదాన్ని గమనించిన కొందరు కారును ఆపే ప్రయత్నం చేసారు. అయితే వారికి చిక్కకుండా కారును వేగంగా పోనిచ్చి తప్పించుకున్నారు. ఇక కారు శరీరంపైనుండి వెళ్లడంతో వృద్దురాలు తీవ్రంగా గాయపడింది. ఆమెను స్థానికులు దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం వృద్దురాలి పరిస్థితి విషమంగానే వుందని సమాచారం.
ఇక ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదస్థలికి దగ్గర్లోని సిసి కెమెరాల ఆధారంగా యాక్సిడెంట్ కు కారణమైన కారును గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.