వైసీపీ నాలుగో జాబితా : ఐదుగురు సిట్టింగులకు నో ఛాన్స్...

By SumaBala BukkaFirst Published Jan 19, 2024, 8:35 AM IST
Highlights

ఇప్పటివరకూ మొత్తం 10 ఎంపీ, 58 ఎమ్మెల్యే స్థానాలకు ఇంచార్జులను ఖరారు చేశారు. మరో 12 ఎంపీ అభ్యర్థులు మారే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతోపాటు మరో 20 మంది  ఎమ్మెల్యే స్థానాలకూ మార్పులు ఉండే ఛాన్స్ ఉందంటున్నారు. 

అమరావతి : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వైసీపీ నాలుగో జాబితా రానే వచ్చింది. భయపడ్డట్టుగానే చాలామంది సిట్టింగులకు నిరాశే మిగిల్చింది. ఇప్పటివరకు వచ్చిన మూడు జాబితాల్లాగే నాలుగో జాబితాలోనూ సిట్టింగులకు టికెట్ గల్లంతయ్యింది. అలా ఇప్పటివరకు విడుదలైన మొత్తం నాలుగు జాబితాల్లో  28 మంది సిట్టింగులకు టికెట్ నిరాకరించారు. వైసిపి నాలుగో లిస్టులో కూడా ఐదుగురు సిట్టింగులు టికెట్ దక్కలేదు. నాలుగో జాబితాలో 8 ఎస్సీ, ఒక జనరల్ సీట్లకు ఇంఛార్జ్ లను ఖరారు చేస్తూ జాబితా విడుదల చేశారు. 

వారెవరంటే... 

Latest Videos

సింగనమల : జొన్నలగడ్డ పద్మావతి

నందికొట్కూరు : ఆర్థర్

తిరువూరు : రక్షణనిధి

మడకశిర : మోపురగుండు తిప్పేస్వామి

కనిగిరి : బుర్ర మధుసూదన్ యాదవ్

బుర్ర మధుసూదన్ యాదవ్ వియ్యంకుడు కొలుసు పార్థసారధికి కూడా టికెట్ దక్కకపోవడంతో టీడీపీలోకి మారే యోచనలో ఉన్నారు. వీరితో పాటు మరో ఇద్దరికి స్థానం చలనం కలిగింది. వీరిలో ఒకరికి ఎంపీ టికెట్ ను, మరో ఎంపీకి ఎమ్మెల్యే టికెట్ ను కేటాయించారు. 

AP Assembly Elections: వైసీపీ నాల్గవ జాబితా విడుదల.. అభ్యర్థులు వీరే..!

వైసీపీ అభ్యర్థుల జాబితాలు ఇంతటితో పూర్తి కాలేదని సమాచారం. ఇంకా రెండు జాబితాలు ఉంటాయంటున్నాయి వైసీపీ వర్గాలు. 

ఇక ఇప్పటివరకు వచ్చిన జాబితాల్లో మార్పులు చూస్తే... 
మొదటి జాబితాలో 11 స్థానాలు 
రెండో జాబితాలో 3 ఎంపీ, 24 ఎమ్మెల్యే
మూడో జాబితా లో 6 ఎంపీ 15 ఎమ్మెల్యే
నాలుగో జాబితాలో 1 ఎంపీ, 8 ఎమ్మెల్యే.

ఇప్పటివరకూ మొత్తం 10 ఎంపీ, 58 ఎమ్మెల్యే స్థానాలకు ఇంచార్జులను ఖరారు చేశారు. మరో 12 ఎంపీ అభ్యర్థులు మారే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతోపాటు మరో 20 మంది  ఎమ్మెల్యే స్థానాలకూ మార్పులు ఉండే ఛాన్స్ ఉందంటున్నారు. 

వైసీపీలో ఈ జాబితాలు మార్పులు, చేర్పులతో రోజు రోజుకి పెరుగుతున్న పార్టీ మారే వారి సంఖ్య పెరిగిపోతోంది. అయితే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రం ఈ సారి మళ్లీ వైసీపీ అధికారంలోకి రావాలని గట్టిపట్టుమీదున్నారు. అందుకే గెలుపు అవకాశం లేదని తెలిసిన వారిని మార్చడానికే మొగ్గు చూపిస్తున్నారు. 

click me!