
YCP Fourth List: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల నాల్గవ లిస్ట్‌ను విడుదల చేయడానికి వైసీపీ భారీ
కసరత్తు చేసింది. ఇప్పటికే 50 అసెంబ్లీ, 9 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్ ఛార్జ్ లను ప్రకటించిన వైసీపీ అధిష్టానం. నాలుగవ జాబితాలో 9 నియోజకవర్గాల్లో మార్పులు చేసింది. ఈ మేరకు వైసీపీ నాలుగవ జాబితాను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. వాస్తవానికి సంక్రాంతి పండుగ కారణంతో మూడు రోజులపాటు అభ్యర్థుల మార్పులు-చేర్పుల కసరత్తుకి బ్రేక్ పడింది. దీంతో నాలుగో జాబితా కాస్త లేట్ అయ్యింది.