షర్మిల కుమారుడి ఎంగేజ్‌మెంట్‌కు హాజరైన వైఎస్ జగన్ , భారతి

By Siva Kodati  |  First Published Jan 18, 2024, 9:42 PM IST

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు , తన సోదరి వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహ నిశ్చితార్ధ వేడుకకు సీఎం వైఎస్ జగన్ సతీసమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వధూవరులు రాజారెడ్డి, ప్రియ అట్లూరిలను జగన్ దంపతులు ఆశీర్వదించారు. 


ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు , తన సోదరి వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహ నిశ్చితార్ధ వేడుకకు సీఎం వైఎస్ జగన్ సతీసమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వధూవరులు రాజారెడ్డి, ప్రియ అట్లూరిలను జగన్ దంపతులు ఆశీర్వదించారు. ఈ సందర్భంగా తన చెల్లెలు షర్మిల, బావ బ్రదర్ అనిల్‌లను ఆయన పలకరించారు. 

 

Latest Videos

 

హైదరాబాద్ గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్‌లో వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి నిశ్చితార్ధం అట్లూరి ప్రియతో జరిగింది. రాజారెడ్డి ఇటీవలే అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం డల్లాస్‌లో అప్లైడ్ ఎకనామిక్స్ అండ్ ప్రిడిక్టివ్ అనలటిక్స్‌లో ఎంఎస్ పూర్తి చేశారు. ఈ క్రమంలో అమెరికాలో చదువుకున్న ప్రియ.. అట్లూరితో గత నాలుగేళ్లుగా పరిచయమై ప్రేమగా మారింది. పెద్దల అంగీకారంతో ఈ జంట పెళ్లి పీటలెక్కుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 17న రాజారెడ్డి, ప్రియల నిశ్చితార్ధం నిర్వహిస్తున్నట్లుగా షర్మిల ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. అనంతరం ఆమె తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ, సినీ ప్రముఖులకు నిశ్చితార్ధ ఆహ్వాన పత్రికను అందజేశారు. 

 

click me!