విశాఖపట్టణం పరవాడ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం: నలుగురు కార్మికులు మృతి

Published : Dec 26, 2022, 09:17 PM ISTUpdated : Dec 26, 2022, 09:22 PM IST
విశాఖపట్టణం పరవాడ ఫార్మాసిటీలో  అగ్నిప్రమాదం: నలుగురు కార్మికులు మృతి

సారాంశం

ఉమ్మడి విశాఖపట్టణం జిల్లా  పరవాడ  ఫార్మాసిటీలో  సోమవారం నాడు  జరిగిన అగ్ని ప్రమాదంలో నలుగురు  కార్మికులు  మృతి చెందారు.మ రొకరు గాయపడ్డారు. 

విశాఖపట్టణం: ఉమ్మడి విశాఖపట్టణం జిల్లా  పరవాడ ఫార్మాసిటీలో  సోమవారంనాడు అగ్ని ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా  ఉంది.పరవాడ ఫార్మాసిటీలోని  లారస్  యూనిట్ -3 లో  షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి.  ఈ మంటల్లో చిక్కుకుని ఐదుగురు కార్మికులు  గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం  ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో  చికిత్స పొందుతూ  నలుగురు కార్మికులు మృతి చెందారు. మరొకరి  పరిస్థితి  విషమంగా  ఉందని వైద్యులు  ప్రకటించారు. 

ఈ ప్రమాదంలో  మృతి చెందిన  కార్మికుల మృతదేహలను  కేజీహెచ్ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.ఖమ్మం జిల్లాకు చెందిన  బి. రాంబాబు, గుంటూరు జిల్లాకు రాజేష్ బాబు , రంగారెడ్డి జిల్లాకు సతీష్ , కోటపాడుకు చెందిన రామకృష్ణ,చోడవరం కు వెంకటరావులు ప్రమాదం జరిగిన ప్రదేశంలో పనిచేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా  గా పడ్డారు. వారిని  ఆసుపత్రికి తరలించారు.ఆసుపత్రిలో  చికిత్స పొందుతూ  నలుగురు మృతి చెందారు. మరొకరు  ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.    

PREV
Read more Articles on
click me!

Recommended Stories

సచివాలయం ఉద్యోగులు VS పోలీస్ లు విజయవాడ ధర్నా చౌక్ వద్ద హై టెన్షన్ | Secretariat Employees Dharna
Weather Update: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. రాబోయే 3 రోజులు దంచికొట్టనున్న వానలు