సుజనా సహకరించలేదు.. హైకోర్టుతో సీబీఐ

By telugu news teamFirst Published Jul 12, 2021, 9:00 AM IST
Highlights

సుజనా గ్రూప్‌ కంపెనీల్లో సోదాలు జరపగా అనేక ఒరిజినల్‌ పాన్‌కార్డులు, 278 రబ్బర్‌ స్టాంపులు, ఖాళీ లెటర్‌హెడ్స్‌తోపాటు కీలక డాక్యుమెంట్లు లభించాయని తెలిపింది.

సుజనా గ్రూపు కంపెనీలు అనేక బ్యాంకుల నుంచి దాదాపు రూ.5వేల కోట్లు అక్రమ రుణాలు తీసుకొని.. అనేక షెల్ కంపెనీలకు తరలించాయంటూ హైకోర్టుకు సీబీఐ నివేదించింది.  కేసు విచారణలో భాగంగా సుజనా గ్రూపు కంపెనీల ఛైర్మన్, రాజ్య సభ సభ్యుడు సుజనా చౌదరికి 2019లో నోటీసులు జారీ చేశారు. కాగా..నోటీసులు జారీ  చేసిన రెండు సార్లు...  అధికారులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేదని సీబీఐ పేర్కొంది.

 సుజనా గ్రూప్‌ కంపెనీల్లో సోదాలు జరపగా అనేక ఒరిజినల్‌ పాన్‌కార్డులు, 278 రబ్బర్‌ స్టాంపులు, ఖాళీ లెటర్‌హెడ్స్‌తోపాటు కీలక డాక్యుమెంట్లు లభించాయని తెలిపింది.

వీటిని పరిశీలిస్తే అనేక బినామీ, డమ్మీ కంపెనీలను ఇక్కడి నుంచే నడిపిస్తున్నట్లుగా ప్రాథమికంగా తేలిందని పేర్కొంది. సుజనాచౌదరి ఇంటిలోనూ బ్యాంకు రుణాల కీలక సమాచారం లభించిందని తెలిపింది. సీబీఐ అధికారులు తనకు లుక్‌ఔట్‌ సర్క్యులర్‌ (ఎల్‌వోసీ) జారీ చేయడాన్ని సవాల్‌ చేస్తూ సుజనాచౌదరి గతేడాది హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసింది.

ఓ సదస్సులో పాల్గొనేందుకు అమెరికా వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన మధ్యం తర పిటిషన్‌ను న్యాయమూర్తి ఇటీవల విచారించారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ ఈ నెల 12 నుంచి ఆగస్టు 11 వరకు సుజనాచౌదరి అమెరికాలో పర్యటించేందుకు అనుమతినిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. 


 

click me!