ప్రేమ జంటను టార్గెట్ చేసి.. యువతిని కోరిక తీర్చాలంటూ ఒత్తిడి చేసి..!

Published : Nov 27, 2021, 10:05 AM ISTUpdated : Nov 27, 2021, 10:08 AM IST
ప్రేమ జంటను టార్గెట్ చేసి.. యువతిని కోరిక తీర్చాలంటూ ఒత్తిడి చేసి..!

సారాంశం

గురుమూర్తి ఒక అమ్మాయిని రెండేళ్లుగా ప్రేమిస్తున్నాడు. వీరి వ్యవహారం తిరుపాల్‌కు తెలిసింది. ఈ విషయాన్ని ఇరు కుటుంబాలకు తెలపకుండా ఉండడానికి డబ్బు డిమాండ్‌ చేశాడు. అంతే కాదు గురుమూర్తి ప్రేమించిన అమ్మాయితో తన కోరిక తీర్చాలని బలవంతం చేశాడు.  

అనంతపురం జిల్లాలో ఇటీవల ఓ విద్యార్థి సంఘటం నేత దారుణ హత్యకు గురయ్యాడు. కాగా... ఈ హత్య కేసు మిస్టరీని పోలీసులు తాజాగా చేధించారు.ఈ హత్య కేసులో పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. కాగా.. విద్యార్థి సంఘం నేత.. ఓ ప్రేమ జంటను టార్గెట్ చేసి.. వారిని డబ్బుల కోసం బెదిరించడం.. యువతిని తన కోరిక తీర్చాలంటూ బలవంత పెట్టాడట. ఈ క్రమంలోనే.. సదరు విద్యార్థి సంఘం నేతను హత్య చేశామని నిందితులు అంగీకరించడం గమనార్హం.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి  వివరాలను పోలీసులు వెల్లడించారు. వజ్రకరూరుకు చెందిన మండ్ల తిరుపాల్‌ యునైటెడ్‌ స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ నాయకుడు. ఇదే గ్రామానికి చెందిన బెస్త గురుమూర్తి ఒక అమ్మాయిని రెండేళ్లుగా ప్రేమిస్తున్నాడు. వీరి వ్యవహారం తిరుపాల్‌కు తెలిసింది. ఈ విషయాన్ని ఇరు కుటుంబాలకు తెలపకుండా ఉండడానికి డబ్బు డిమాండ్‌ చేశాడు. అంతే కాదు గురుమూర్తి ప్రేమించిన అమ్మాయితో తన కోరిక తీర్చాలని బలవంతం చేశాడు.

Also Read: ఒక్క వజ్రం.. లక్షాధికారిగా మారిన కూలీ..!

అడిగినంత డబ్బుతో పాటు కామవాంఛ తీర్చాలన్న తిరుపాల్‌ బెదిరింపులను గురుమూర్తి తట్టుకోలేకపోయాడు. ఎలాగైనా ఇతడిని అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. తమ గ్రామానికి చెందిన కురుబ ఆవుల ఎర్రిస్వామిని సంప్రదించి రూ.3.50 లక్షలతో తిరుపాల్‌ హత్యకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ మేరకు ఎర్రిస్వామి తన స్నేహితులు చాకలి సునీల్, మఠం వేణుగోపాల్‌తో కలిసి అక్టోబర్‌ 24న పార్టీ చేసుకుందామని తిరుపాల్‌ను వజ్రకరూరు గ్రామంలోని చింతలపల్లి రోడ్డులో గల కనుమ మిట్ట వద్దకు పిలుచుకెళ్లారు. అక్కడ కత్తులతో పొడిచి, గొంతు కోసి తిరుపాల్‌ను చంపేశారు.

Also Read: దారుణం.. సరదా కోసం మలద్వారం గుండా గాలిని శరీరంలోకి పంపి.. చంపేశారు...!

మృతదేహం ఆనవాళ్లు దొరక్కుండా షర్టుతో చేతులు కట్టి, తల నుంచి నడుము వరకు సంచిలోకి దూర్చి, నడుము నుంచి కాళ్ల వరకు చీరతో చుట్టి.. ఆ చీరకు బరువైన రాయిని కట్టి కమలపాడు గ్రామానికి చెందిన కురుబ నాగప్ప పొలంలోని వ్యవసాయ బావిలో పడేశాడు. తిరుపాల్‌కు చెందిన బజాజ్‌ సీటీ 100 మోటార్‌ బైక్‌ను, హత్యకు ఉపయోగించిన కత్తులను కూడా అందులోనే వేశారు. తిరుపాల్‌ కనిపించడం లేదన్న కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వజ్రకరూరు పోలీస్‌ స్టేషన్‌లో ‘మిస్సింగ్‌’ కేసు నమోదైంది. కాగా...  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

PREV
click me!

Recommended Stories

Humanoid Robot Introduced at Visakhapatnam Railway Station | Waltair Division | Asianet News Telugu
Palla Srinivas on Lokesh Birthday: లోకేష్అంటే నమ్మకం.. నిత్యంప్రజల్లోనే ఉంటారు | Asianet News Telugu