TTD sarva darshanam tickets: డిసెంబర్ నెల శ్రీవారి సర్వదర్శనం టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల..

Published : Nov 27, 2021, 09:49 AM IST
TTD sarva darshanam tickets: డిసెంబర్ నెల శ్రీవారి సర్వదర్శనం టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల..

సారాంశం

తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల కోసం టీటీడీ (TTD) సర్వదర్శన (ఉచిత దర్శనం) టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. డిసెంబర్ నెలకు సంబంధించిన సర్వదర్శన టికెట్లను (sarva darshan tickets) శనివారం ఉదయం టీటీడీ విడుదల చేసింది.  

తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల కోసం టీటీడీ (TTD) సర్వదర్శన (ఉచిత దర్శనం) టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. డిసెంబర్ నెలకు సంబంధించిన సర్వదర్శన టికెట్లను (sarva darshan tickets) శనివారం టీటీడీ విడుదల చేసింది. ఓటీపీ, వర్చువల్ క్యూ పద్దతిలో టీటీడీ ఈ టికెట్ల కేటాయింపు చేపట్టింది. రోజుకు 10 వేల టికెట్ల చొప్పున డిసెంబర్ (december 2021) నెల కోటాను టీటీడీ విడుదల చేసింది. ఇక, రేపు (నవంబర్ 28) ఉదయం 9 గంటలకు అద్దె గదుల కోటాను టీటీడీ విడుదల చేయనుంది. డిసెంబర్ నెలకు సంబంధించిన కోటాను విడుదల చేయనున్నట్టుగా టీటీడీ తెలిపింది.  

రికార్డు స్థాయిలో శ్రీవారి దర్శన టికెట్లను భక్తులు బుక్ చేసుకుంటున్నారు. డిసెంబర్ నెలకు 3.10 లక్షల టికెట్లను టీటీడీ విడుదల చేసింది. అయితే 13 నిమిషాల వ్యవధిలోనే భక్తులు 2.80 లక్షల టికెట్లు పొందారు. గత నెలలో 2.40 లక్షల టికెట్లను భక్తులు 19 నిమిషాల వ్యవధిలో పొందారు. 

ఇక, ఆన్‌లైన్ ద్వారా స్లాట్స్ బుక్ చేసుకున్నవారికే తిరుమల శ్రీవారి దర్శనానికి టీటీడీ అనుమతిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని గుర్తించి..తిరుమలకు వచ్చేముందు స్వామివారి దర్శనం టోకెన్లు, తిరుమలలో అద్దె గదులు బుక్ చేసుకోవాలని టీటీడీ భక్తులను కోరింది.

ఇక, తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి ప్రతి రోజు వేల సంఖ్యలో భక్తులు వస్తారనే సంగతి తెలిసిందే. అయితే కరోనా పరిస్థితుల నేపథ్యంలో టీటీడీ.. ఆన్‌లైన్ ద్వారా దర్శనానికి సంబంధించిన టికెట్ బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది. అంతేకాకుండా రోజుకు పరిమిత సంఖ్యలో మాత్రమే జనాలను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తుంది. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్