చైల్డ్ పోర్న్ వీడియోలు అమ్ముతున్న ఇంజనీర్ అరెస్ట్...

By AN TeluguFirst Published Nov 27, 2021, 9:46 AM IST
Highlights

చిన్నారులతో చేసిన నీలి చిత్రాలు చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించి ఇటీవల దేశంలోని వివిధ ప్రాంతాల్లో సిబిఐ ఏకకాలంలో తనిఖీలు చేపట్టింది.  సంబంధం ఉన్న పలువురిని అరెస్టు చేసింది.  ఇందులో భాగంగానే ఈ తరహా నేరం చేసే విజయవాడ నగరానికి చెందిన యువకుడు అరెస్ట్ అయ్యాడు.

అమరావతి :  ఇంజనీరింగ్ చదివిన కుర్రవాడు దారి తప్పాడు.  పలు ఉద్యోగాలు చేసి  మానేసిన అతడు, కాలక్షేపం కోసం  porn videos చూడడం అలవాటు చేసుకున్నాడు. ఓ ప్రకటన చూసి  చిన్నారుల  వీడియోలను కూడా కొనుగోలు చేశాడు.  ఆ తరువాత వాటిని మరొకరికి అమ్ముతూ పోలీసులకు దొరికిపోయాడు.

చిన్నారులతో చేసిన నీలి చిత్రాలు child pornography కు సంబంధించి ఇటీవల దేశంలోని వివిధ ప్రాంతాల్లో సిబిఐ ఏకకాలంలో తనిఖీలు చేపట్టింది.  సంబంధం ఉన్న పలువురిని అరెస్టు చేసింది.  ఇందులో భాగంగానే ఈ తరహా నేరం చేసే విజయవాడ నగరానికి చెందిన యువకుడు అరెస్ట్ అయ్యాడు.

రెట్టింపుకు అమ్ముతూ…
విజయవాడ ఫకీర్ గూడెం ప్రాంతానికి చెందిన  సోహెల్ అహ్మద్  ఓ ప్రముఖ కళాశాలలో Civil Engineering చదివాడు.  హైదరాబాద్, అమరావతిలో  పలు ఉద్యోగాలు చేశాడు.  ఎక్కడ ఆశించిన జీవితం రాకపోవడంతో  తరచూ మానేసి మరొకటి పెట్టుకునేవాడు. ఈమధ్య Online లో ఎక్కువ సమయం నీలి చిత్రాలు చూస్తూ గడుపుతున్నాడు.

Telegramలోని  గ్రూప్ లో  ప్రకటన చూసి ఆకర్షితుడయ్యాడు.  చిన్నారుల  నీలి చిత్రాలు  అమ్ముతాం అన్నది  దాని సారాంశం.  దీంతో ఆసక్తిగా అనిపించి ప్రకటనలో ఇచ్చిన నెంబర్కు ఫోన్ చేసి సంప్రదించాడు.. రూ. 250 కి బేరం కుదుర్చుకుని నగదు ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేశాడు. ఆ తర్వాత అవతలి వ్యక్తి పంపిన లింకు ను  Sohel క్లిక్ చేయగా,  నాలుగు వేల వీడియో లు వచ్చాయి.  

అవన్నీ 18 ఏళ్ల లోపు వారివే.  వీటిని ఎక్కువ ధరకు ఇతరులకు అమ్మి సొమ్ము చేసుకోవచ్చని..  సామాజిక మాధ్యమాల్లో ప్రకటన ఇచ్చాడు. దీనిని ఢిల్లీకి చెందిన నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ప్రతినిధి చూసి అలర్ట్ అయ్యాడు.  సోహైల్ ని సంప్రదించి కొంటాం అంటూ  బేరం ఆడాడు. రూ. 500కు అతడికి సోహెల్ ఈ వీడియోలను విక్రయించాడు.  దీనిపై NCPCR  ప్రతినిధి అను చౌదరి హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  నిందితుడు  విజయవాడకు చెందిన వ్యక్తి కావడంతో ఇక్కడ సైబర్ క్రైమ్ స్టేషన్కు  కేసు బదిలీ అయింది.

రోడ్డు పక్కన సగం కాలిన స్థితిలో మృతదేహం : బీటెక్ విద్యార్ధిగా గుర్తింపు... హత్యా, ఆత్మహత్యా..?

నగర పోలీసులు  పోస్కో, ఐటీ చట్టాల కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.  ఎక్కడి నుంచి వీడియోలు వచ్చాయి? ఇంకా ఎవరెవరికి  విక్రయించాడు?  అన్న కోణంలో విచారిస్తున్నారు.

చూసినా.. షేర్ చేసినా నేరమే..
POSCO Act ప్రకారం  వయసు లోపు  ఉన్న వారితో అభ్యంతరకరమైన చిత్రాలు తీయడం పూర్తిగా నిషేధం.  తీసినా, సేకరించినా,  చూడడం, ఇతరులకు పంపడం  కూడా  నేరం కిందకే వస్తుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇటువంటి వారిపై నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నిఘా పెట్టింది.  ఇటువంటి వారి ఐపీ చిరునామాల ఆధారంగా తనిఖీలు జరుగుతున్నాయి.

click me!