రాజా ఆశోక్‌బాబు చూపు : పవన్‌ వైపా, జగన్ వైపా

By narsimha lodeFirst Published Aug 23, 2018, 4:10 PM IST
Highlights

కాంగ్రెస్ పార్టీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే రాజా ఆశోక్‌బాబు జనసేనలో చేరేందుకు మొగ్గు చూపుతున్నారనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయమై ఇంకా స్పష్టత రాలేదు

 తుని: కాంగ్రెస్ పార్టీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే రాజా ఆశోక్‌బాబు జనసేనలో చేరేందుకు మొగ్గు చూపుతున్నారనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయమై ఇంకా స్పష్టత రాలేదు. గత ఎన్నికల్లో ఆయన  పోటీ చేయలేదు. దీంతో క్యాడర్ పలు పార్టీల్లోకి వలస పోయింది.

తూర్పుగోదావరి జిల్లాలోని తుని మాజీ ఎమ్మెల్యే రాజా ఆశోక్‌బాబు జనసేనలో చేరేందుకు చూస్తున్నారని సమాచారం.తుని సంస్థానాన్ని రాజవంశానికి చెందినవాడు  రాజా ఆశోక్‌బాబు. ఆశోక్‌బాబు తాత బులిబాబు. తుని అసెంబ్లీ స్థానం నుండి  తొలి సారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

పనిచేసే ఓటమెరుగని వీరునిగా చరిత్ర సృష్టించారు. ఆశోక్‌బాబు  మేనత్త బులిబాబు కుమార్తె ఎంఎన్ విజయలక్ష్మీదేవి ఎన్నికై రెండు పర్యాయాలు  పనిచేసింది. అప్పట్లో పీవీ నరసింహారావు మంత్రివర్గంలో తొలి మహిళా, శిశు అభివృద్ధిశాఖ మంత్రిగా పనిచేశారు.  వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న కాలంలో రాజా ఆశోక్‌బాబు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.


2019 ఎన్నికల్లో రాజా ఆశోక్‌బాబు పోటీ చేయలేదు. దీంతో ఆయన క్యాడర్‌ పలు పార్టీల్లోకి వలస వెళ్లారు. ఎక్కువగా వైసీపీలోకి ఆయన క్యాడర్ వలస వెళ్లింది.అయితే గత ఎన్నికల నుండి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.  

అయితే 2019 ఎన్నికల్లో పోటీ చేయాలని  రాజా ఆశోక్ బాబుపై ఆయన అనుచరులు వత్తిడి తెస్తున్నారు. దీంతో ఆయన కూడ  పోటీ చేసేందుకు ఆసక్తిని చూపుతున్నారు.

అయితే రాజా ఆశోక్‌బాబు  ఏ పార్టీలో చేరాలనే విషయమై తన అనుచరులతో మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం. అయితే  కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసే పరిస్థితులు కన్పించడం లేదు. వైసీపీ నేతలతో టచ్‌లోకి వెళ్లినా  ఆశించిన ప్రయోజనం దక్కలేదు. దీంతో జనసేనలో చేరేందుకు ఆసక్తిని  ప్రదర్శిస్తున్నట్టు సమాచారం.

కాపుల్లో మంచి పట్టున్న ఆశోక్‌బాబు  ఏ పార్టీలో చేరుతారనేది ఆసక్తి నెలకొంది. 2019 ఎన్నికల్లో  పోటీకి రంగం సిద్దం చేసుకొంటున్నట్టు ప్రకటించారు. అయితే  వైసీపీలో చేరుతారా, జనసేన నుండి పోటీ చేస్తారా అనేది మాత్రం  ఇంకా స్పష్టత రావాల్సి  ఉంది.

ఈ వార్తలు చదవండి

ఏపీలో కాంగ్రెస్‌కు భారీ షాక్: టీడీపీలోకి క్యూ కడుతున్న నేతలు

సస్పెన్స్ కి తెరదించిన ఆనం... తర్వాత నేదురుమల్లి
గవర్నర్‌తో బేటీ: ఇదీ మా ప్లాన్, తేల్చేసిన బాబు

click me!