అధికారంపై వ్యామోహం తప్ప ప్రజా సమస్యలు పట్టవు: బాబుపై వైసీపీ నేతల ఫైర్

లోకేష్ పాదయాత్రపై  వైసీపీ నేతలు విమర్శలు గుప్పించారు.  విజయవాడలో  లోకేష్ పాదయాత్రకు ఇతర ప్రాంతాల నుండి జనాన్ని తెచ్చి షో చేస్తున్నారని  వైసీపీ నేతలు చెప్పారు.


విజయవాడ: ఏపీ సీఎం వైఎస్ జగన్ పై బురద చల్లడమే ధ్యేయంగా చంద్రబాబు పనిచేస్తున్నారని  మాజీ మంత్రి వెల్లంపల్లి  శ్రీనివాసులు విమర్శించారు.ఆదివారంనాడు విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు.అధికార పిచ్చి తప్ప, ప్రజా సమస్యలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పట్టవన్నారు.గుంటూరు,విజయవాడకు చంద్రబాబు అన్యాయం చేశారని ఆయన ఆరోపించారు. సీఎంగా ఉన్న సమయంలో విజయవాడలో చంద్రబాబు 45 ఆలయాలను  కూల్చారని ఆయన గుర్తు చేశారు. 

లోకేష్ పాదయాత్ర అబద్దాలతో సాగుతుందని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు.వారధి మీద  ఫోటో కోసం రూ. 5 కోట్లు ఖర్చు చేశారన్నారు. కిరాయికి జనాన్ని తీసుకు వచ్చి లోకేష్ యాత్ర  నిర్వహిస్తున్నారని విష్ణు ఆరోపించారు.జన్మభూమి కమిటీలతో  గత ప్రభుత్వం పాల్పడిందన్నారు.  డీబీటీ ద్వారా  నేరుగా లబ్దిదారులకు  నిధులు అందిస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదన్నారు. 

Latest Videos

లోకేష్‌ది యువగళం పాదయాత్ర కాదు ఈవినింగ్ వాక్ అంటూ దేవినేని అవినాష్ సెటైర్లు వేశారు. ఇచ్చిన హామీలను  నెరవేర్చిన నాయకుడు సీఎం జగన్ అని  ఆయన చెప్పారు. లోకేష్ పాదయాత్రను  టీడీపీ నేతలే పట్టించుకోవడం లేదన్నారు. ఇతర ప్రాంతాల నుండి జనాన్ని తరలించి  షో నిర్వహిస్తున్నారని  ఆయన మండిపడ్డారు.

click me!