కేసుల్లో టీడీపీ నేతలు: అజ్ఞాతంలో మరో మాజీమంత్రి

By Nagaraju penumala  |  First Published Sep 12, 2019, 12:20 PM IST

హైకోర్టు సీఆర్పీసీ 41ఏ కింద నోటీసు జారీ చేసి విచారించాలని ఆదేశించారు. అప్పటి నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కనీసం కార్యకర్తలకు కూడా ఫోన్ లోకి అందుబాటులోకి రాకపోవడంతో చర్చనీయాంశంగా మారింది. 


నెల్లూరు: తెలుగుదేశం పార్టీ నాయకులను కేసులు వెంటాడుతూ ఉన్నాయి. ఇప్పటికే పలువురు కేసులను ఎదుర్కొంటున్నారు. ఇప్పటి వరకు అజ్ఞాతంలో ఉన్న నేతలు ప్రత్యక్షమవ్వడగా తాజాగా మరో నేత అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. 

భూ వివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దాంతో ఆయన ఇంటికి నోటీసులు అంటించి వెనుదిరిగారు వెంకటాచలం పోలీసులు. 

Latest Videos

undefined

వివరాల్లోకి వెళ్తే నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం ఇడిమేపల్లిలో సర్వే నంబరు 58/3లో 2.41 ఎకరాల భూమిని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తన రాజకీయ పలుకుబడితో రికార్డులు తారుమారు చేశారని ఏలూరు రంగారెడ్డి అనే వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 

ప్రైవేట్‌ కేసు దాఖలు చేయడంతో కోర్టు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి మాజీమంత్రి సోమిరెడ్డిని మొదటి నిందితుడిగా చేర్చి విచారించాల్సిందిగా వెంకటాచలం పోలీసులను ఆదేశించింది. దీంతో కేసు నమోదు చేసిన వెంకటాచలం పోలీసులు సోమిరెడ్డిపై కేసు నమోదు చేశారు. 

విచారణకు హాజరు కావాల్సిందిగా సీఆర్‌పీసీ 160, 91 కింద నోటీసులు జారీ చేశారు. మొదటిసారి పోలీసులు నోటీసులతో అల్లీపురంలోని సోమిరెడ్డి నివాసానికి వెళ్లగా సోమిరెడ్డి లేకపోవడంతో  వెనుదిరిగారు. 

మళ్లీ రెండోసారి సోమిరెడ్డి నోటీసులు తీసుకొని ఈ నెల 9న వెంకటచాలం పోలీసుస్టేషన్‌లో విచారణకు హాజరవుతానని స్పష్టం చేశారు. అయితే  ఈనెల9న విచాణకు గైర్హాజరవ్వడంతో పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు. 

అయితే నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్లిపోయిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తన న్యాయవాదులను పంపించిపోలీసులకు డాక్యుమెంట్లు చూపించారు. ఈ కేసులో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డినే విచారించాల్సి ఉందని పోలీసులు తేల్చి చెప్పారు.  

సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హైకోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసిన క్రమంలో కోర్టు సీఆర్‌పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. దీంతో వెంకటాచలం పోలీసులు నోటీసులు సిద్ధం చేసి హైదరాబాద్‌లో సోమిరెడ్డి నివాసానికి వెళ్లగా అక్కడ కూడాలేకపోవడంతో ఆయన ఇంటికి నోటీసు అతికించారు. 

సోమిరెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై ప్రభుత్వం తరఫున న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ఈనెల 9న విచారణకు హాజరవుతానని నోటీసులు తీసుకొని గైర్హాజరయ్యాడని, ఈ క్రమంలో ఆయన్ని ఆరెస్ట్‌ చేసి విచారించాల్సిందిగా పోలీసులకు ఆదేశాలు ఇచ్చి బెయిల్‌ పిటిషన్‌ రద్దు చేయాలని విన్నవించారు. 

హైకోర్టు సీఆర్పీసీ 41ఏ కింద నోటీసు జారీ చేసి విచారించాలని ఆదేశించారు. అప్పటి నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కనీసం కార్యకర్తలకు కూడా ఫోన్ లోకి అందుబాటులోకి రాకపోవడంతో చర్చనీయాంశంగా మారింది. 

ఈ వార్తలు కూడా చదవండి

సరస్వతి భూముల కోసమే నాపై కేసులు: అజ్ఞాతం వీడిన యరపతినేని

సోమిరెడ్డికి షాక్.. భూ వివాదంలో నోటీసులు

కేసులు పెడతారని ఊహించా: సోమిరెడ్డి

ఫోర్జరీ సంతకాలు.. భూమి విక్రయం: మాజీ మంత్రి సోమిరెడ్డిపై కేసు నమోదు

click me!