తప్పు చేసిన వారికే ఫోన్ ట్యాపింగ్ అంటే భయం: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి పేర్ని నాని కౌంటర్

By narsimha lode  |  First Published Feb 2, 2023, 2:40 PM IST

గత ఏడాది   డిసెంబర్  25నే  చంద్రబాబునాయుడిని   కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి  హైద్రాబాద్ లో కలిశారని  మాజీ మంత్రి  పేర్ని నాని  చెప్పారు. జగన్ పై అభిమానం కంటే  అవసరాలే  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి  ఎక్కువైనట్టుగా  పేర్ని నాని తెలిపారు.  


తాడేపల్లి: జగన్  మరోసారి ముఖ్యమంత్రి కావాలని కోరుకునే  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి  టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తో  ఎందుకు  టచ్ లో  ఉన్నాడని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. గురువారం నాడు   మాజీ మంత్రి పేర్ని నాని   అమరావతిలో మీడియాతో మాట్లాడారు.  మన ఆలోచనలు కల్మషం లేకుండా  ఉంటే   ఫోన్ ట్యాపింగ్  చేస్తే నష్టం ఏముంటుందని ఆయన ప్రశ్నించారు. ఏదైనా తప్పు చేసినవారికే  ఫోన్ ట్యాపింగ్  అనే  భయం ఉంటుందని   మాజీ మంత్రి పేర్ని నాని  చెప్పారు.  

  గత ఏడాది డిసెంబర్  25నే  కోటంర్ రెడ్డి శ్రీధర్ రెడ్డి  చంద్రబాబును కలిశాడని  ఆయన  చెప్పారు. బ్లూ కలర్ జెంజ్ కారులో  హైద్రాబాద్ లో  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి  చంద్రబాబును కలిసినట్టుగా కోటంరెడ్డి పేర్ని నాని తెలిపారు.   ఎప్పటికప్పుడు టీడీపీ నాయకత్వంతో   కోటం రెడ్డి  శ్రీధర్ రెడ్డి  టచ్ లో  ఉన్నారని  తేలిందన్నారు.   వైసీపీ, జగన్ పై అభిమానం కంటే  అవసరాలే ముఖ్యమని  శ్రీధర్ రెడ్డి  భావించి  ఉంటారని ఆయన  చెప్పారు.

Latest Videos

undefined

 మా ఎమ్మెల్యేలపై  ఎందుకు  నిఘా  పెట్టుకుంటామని ఆయన ప్రశ్నించారు.   జగన్ మళ్లీ సీఎం కావాలని   కోరుకొనే కోటంురెడ్డి శ్రీధర్ రెడ్డి  లోకేష్ తో  ఎందుకు టచ్ లో  ఉన్నారని  పేర్ని నాని ప్రశ్నించారు.  నెల్లూరు నారాయణతో  టచ్ లో  ఉండాలని   చంద్రబాబునాయుడు  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి  చెప్పినట్టుగా  ప్రచారం సాగుతుందని  చెప్పారు.

also read:శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్లు పార్టీని వీడితేనే మంచిది: మాజీ మంత్రి కొడాలి నాని

  కోటంరెడ్డి  శ్రీధర్ రెడ్డి  జగన్  కు  ద్రోహం  చేశారన్నారు.  టీడీపీ వాళ్ల మాటలను  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి  చెబుతున్నారన్నారు.   కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి  టీడీపీ నేతల ట్రాప్ లో  పడ్డారని  మాజీ మంత్రి పేర్ని నాని  చెప్పారు.  సీఎం జగన్ పై  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి  చేసిన  ఆరోపణలను  ఆయన  విజ్గతకే వదిలేస్తున్నట్టుగా  మంత్రి  చెప్పారు.  

రెండుసార్లు  ఎమ్మెల్యేగా  చేయడం సామాన్య విషయమా  అని  పేర్ని నాని ప్రశ్నించారు.   ఎలాంటి రాజకీయ  నేపథ్యం లేని  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రెండు సార్లు  ఎమ్మెల్యేగా  ఎన్నికైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.  వర్షాకాలం, వేసవికాలం, శీతాకాలం మాదిరిగా  ఇది వలసలు వెళ్లే  కాలమన్నారు. ఒక పార్టీ నుండి మరో పార్టీలోకి  నేతలు  వలసలు వెళ్తుంటారని... అందుకే  ఇదంతా  వలసల కాలంగా  తాను పేర్కొన్నట్టుగా  ఆయన  చెప్పారు. 
 

click me!