ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై ప్రభుత్వం సీరియస్.. రంగంలోకి ఇంటెలిజెన్స్.. రామ శివారెడ్డి ఫోన్ డేటా పరిశీలన..

By Sumanth KanukulaFirst Published Feb 2, 2023, 1:37 PM IST
Highlights

నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన ఫోన్ ట్యాపింగ్‌ ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ వ్యవహారాన్ని  రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. 

నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన ఫోన్ ట్యాపింగ్‌ ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ వ్యవహారాన్ని  రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. కోటంరెడ్డి ఆరోపణల్లో నిజం లేదని.. ఫోన్ ట్యాపింగ్ జరగలేదని, అది రికార్డింగ్ అని మంత్రులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్ అధికారులను రంగంలోకి దించింది. ఫోన్ ట్యాపింగ్‌ ఆరోపణలపై దృష్టి సారించిన ఇంటెలిజెన్స్ అధికారులు.. కోమటిరెడ్డి శ్రీధర్ రెడ్డి విడుదల చేసిన ఆడియోపై వివరాలు సేకరిస్తున్నారు. 

తన స్నేహితుడు రామ శివారెడ్డితో మాట్లాడిన సమయంలో తన ఫోన్ ట్యాప్ అయిందని కోమటిరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారు. అందుకు సంబంధించిన ఆడియోను కూడా విడుదల చేశారు. ఈ క్రమంలోనే  రామ శివారెడ్డిని ఇప్పటికే విజయవాడకు పిలిపించిన ఇంటెలిజెన్స్ అధికారులు.. ఆయన నుంచి వివరాలు సేకరిస్తున్నారు. రామ శివారెడ్డి ఫోన్ డేటాను ఇంటెలిజెన్స్ అధికారులు విశ్లేషిస్తున్నారు

ఇదిలా ఉంటే.. నెల్లూరు రూరల్ వైపీపీ ఇంచార్జ్‌గా ఎంపీ అదాల ప్రభాకర్ రెడ్డి నియామకం దాదాపుగా ఖరారైనట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి వైసీపీ అధిష్టానం ఈరోజు ప్రకటన చేసే అవకాశం ఉంది. వైసీపీ ఆదేశాలతో ఢిల్లీ నుంచి రాష్ట్రానికి చేరుకున్న అదాల ప్రభాకర్ రెడ్డి.. కాసేపట్లో తాడేపల్లిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో భేటీ కానున్నారు. అదాల ప్రభాకర్ రెడ్డితో పాటు మాజీ మంత్రి, వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ బాలినేని శ్రీనివాస్ రెడ్డి కూడా సీఎం జగన్‌తో సమావేశం కానున్నారు. ఇక, సీఎం జగన్‌ను కలిసేందుకు వెళ్తున్న సమయంలో అదాల ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ ఏ బాధ్యత ఇచ్చిన స్వీకరించేందుకు సిద్దంగా ఉన్నానని చెప్పారు. 

click me!