అదంతా దుష్ప్రచారం.. పార్టీ మారే ఉద్దేశం లేదు, రాజకీయాల్లో ఉన్నంత వరకు జగనన్న వెంటే... మేకతోటి సుచరిత

By SumaBala BukkaFirst Published Feb 2, 2023, 2:13 PM IST
Highlights

ఏపీ మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత పార్టీ మారునుందని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ఆమె స్పష్టం చేశారు. రాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్న వెంటే ఉంటానన్నారు. 

గుంటూరు : ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీలో ఎమ్మెల్యేల ఆరోపణలు, ప్రత్యారోపణలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు, పార్టీ మారుతున్న ప్రచారాలు కలకలం రేపుతుండగా.. తాజాగా మాజీ హోంమంత్రి సుచరిత కూడా పార్టీ మారతారన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. 

తాను వైసీపీ పార్టీ నుంచి మారిపోతున్నానంటూ సోషల్ మీడియాలో వదంతులు వస్తున్న నేపథ్యంలో  ఆంధ్రప్రదేశ్ మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత  స్పందించారు. తప్పుడు ప్రచారాల మీద సీరియస్ అయ్యారు.  తనకు వైసిపిని వీడే ఉద్దేశం లేదని స్పష్టంగా తెలియజేశారు. రాజకీయాల్లో ఉన్నంత కాలం తాను వైసీపీలోనే ఉంటానని చెప్పుకొచ్చారు. 

ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై ప్రభుత్వం సీరియస్.. రంగంలోకి ఇంటెలిజెన్స్.. రామ శివారెడ్డి ఫోన్ డేటా పరిశీలన..

తనమీద దుష్ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో గురువారం గుంటూరులో మేకతోటి సుచరిత మీడియాతో మాట్లాడారు. ‘మేకతోటి సుచరిత పార్టీ మారుతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. కానీ నాకు పార్టీ మారే ఉద్దేశం లేదు. వైసీపీ తప్ప వేరే పార్టీ నాకు తెలియదు. వెళ్లను. ఒకవేళ వైసీపీని కనుక వీడితే నేను ఇంటికి పరిమితం అవుతాను. అంతేకానీ వేరే పార్టీలోకి వెళ్లను. రాజకీయాల్లో ఉన్నంతకాలం వైయస్ జగన్ వెంటే ఉంటాను. ముఖ్యమంత్రి టికెట్ ఎక్కడ ఇస్తే  అక్కడి నుంచే పోటీ చేస్తాను. వైపీసీ పార్టీలో ఎవరు తప్పు పనిచేసినా ఇంటిలిజెన్స్ రిపోర్టు తప్పక ఉంటుంది. అంతేకాని, దీనికోసం ఫోన్ క్యాపింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. 

వైయస్సార్సీపి పార్టీ విద్యావ్యవస్థలో పెనుమార్పులు తీసుకువచ్చింది. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పథకాలు అందజేస్తుంది. ప్రతి ఒక్కరికి విద్య అందేలా జగనన్న ప్రభుత్వం కృషి చేస్తుంది. వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి ప్రజలలో విపరీతమైన మద్దతు ఉంది. గడపగడపకు కార్యక్రమంలో ప్రజలు ప్రభుత్వానికి తమ మద్దతును ఎంతో సంతోషంగా తెలుపుతున్నారు’ అని  కామెంట్ చేశారు.

click me!