టీడీపీకి మాజీ మంత్రి మురుడుగు హనుమంతరావు రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని టీడీపీ చీఫ్ చంద్రబాబుకు ఆయన పంపారు. పార్టీలో తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదనే కారణంగానే టీడీపీకి గుడ్ బై చెప్పినట్టుగా హనుమంతరావు తెలిపారు.
గుంటూరు: టీడీపీకి (tdp)మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు(murugudu hanumantha rao) రాజీనామా(resign) చేశారు. ఇప్పటికే వరుస ఓటములతో ఇబ్బందుల్లో ఉన్న టీడీపీకి కొందరు సీనియర్లు పార్టీని వీడడం కూడ ఆ పార్టీని షాక్ కు గురి చేస్తోంది. గుంటూరు జిల్లా మంగళగిరి(mangalagiri) నియోజకవర్గానికి చెందిన హనుమంతరావు టీడీపీకి గుడ్ బై చెప్పడం చర్చకు దారి తీసింది.
పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వటం లేదని మురుగుడు హనుమంతరావు పేర్కొన్నారు. తన సేవలను పార్టీ సక్రమంగా వినియోగించుకోవడం లేదని ఆయన పార్టీ నాయకత్వానికి పంపిన లేఖలో పేర్కొన్నారు.గత ఏడాది నుంచి టీడీపీకి దూరంగా ఉంటున్నానని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.ఏ పార్టీలోకి వెళ్ళేది కార్యకర్తలు, అభిమానులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానన్నారు.
ప్రభుత్వ సహకారం లేనిదే ఆప్కో అభివృద్ధి చెందదన్నారు. అదే కారణంతో తాను టీడీపీలోకి వచ్చానని హనుమంతరావు గుర్తు చేసుకొన్నారు. కానీ చంద్రబాబునాయుడు సర్కార్ ఆప్కో అభివృద్దికి పెద్దగా సహకరించలేదని ఆయన ఆరోపించారు.1999, 2004లో మంగళగిరి నియోజకవర్గం నుంచి హనుమంతరావు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా విజయం సాధించారు. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుండి నారా లోకేష్ పోటీ చేసి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యాడు.