తెలుగు రాష్ట్రాల్లో డెంగ్యూ పంజా.. ఒక్కసారిగా పెరిగిన కేసులు.. !

By AN TeluguFirst Published Sep 23, 2021, 11:58 AM IST
Highlights

ఈ రెండు లక్షణాలు ఒకేలాగా ఉండడంతో.. తమకు వచ్చింది కరోనానా, డెంగ్యూనా తేల్చుకోలేకపోతున్నారు. డెంగ్యూలోనూ కొత్త మ్యూటెంట్లు వస్తూ.. ప్రజలను వణికిస్తున్నాయి. దీంతో ఆసుపత్రుల చుట్టూ జనాలు తిరుగుతున్నారు. 

తెలుగు రాష్ట్రాల్లో డెంగ్యూ ఫీవర్ (Dengue Fever)పంజా విసురుతోంది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ (Covid 19) ఇంకా పూర్తిగా పోకముందే జ్వరాలు విరుచుకుపడుతున్నాయి. మరోవైపు థార్డ్ వేవ్ (Third Wave) భయాలు తొంగి చూస్తూనే ఉన్నాయి. ఈ లోపు కొత్తగా చాపకింద నీరులా డెంగ్యూ  వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు కనిపిస్తోంది. 

ఈ రెండు లక్షణాలు ఒకేలాగా ఉండడంతో.. తమకు వచ్చింది కరోనానా, డెంగ్యూనా తేల్చుకోలేకపోతున్నారు. డెంగ్యూలోనూ కొత్త మ్యూటెంట్లు వస్తూ.. ప్రజలను వణికిస్తున్నాయి. దీంతో ఆసుపత్రుల చుట్టూ జనాలు తిరుగుతున్నారు. 

డెంగ్యూ కు కారణమవుతున్న సీరో టైప్ 2 మీద కేంద్రం అలర్ట్ అయింది. ఇది సంక్రమించడమే కాదు మరణాలూ ఎక్కువగా నమోదవుతుండడంతో తెలుగు రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. 

డెంగ్వీగా పిలిచే డెంగ్యూ ఫీవర్ లో ఒకసారి ఒక స్ట్రెయిన్ సోకిన వారికి మరోసారి మరో స్టెయిన్ సోకే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లో నమోదవుతున్న డెంగ్యూ కేసుల్లో డీ2, డీ4 వేరియంట్ల ద్వారా వస్తున్నాయి. దీనివల్ల ఓడిశాలో కూడా కేసులు పెరిగాయి. 

ఫ్లూ లాంటి లక్షణాలతో 2 నుంచి 7 రోజుల వరకు ఇది ఉంటుంది. ఆగస్ట్ వరకు డెంగ్యూ కేసుల సంఖ్య సాధారణంగా ఉండగా.. ఒక్కసారిగా సెప్టెంబర్ కేసులు అమాంతం పెరిగాయని డాక్టర్లు చెబుతున్నారు. దీని నివారణకు దోమకాటు వేయకుండా చూసుకోవాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. 

కాగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 13 జిల్లాల్లో ప్రస్తుతం 2,124 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. 

ఏయూలో అమెరికన్ కార్నర్ : ప్రారంభించిన ఏపీ సీఎం జగన్

అయితే ఇదివరకటితో పోలిస్తే కేసులు ఎక్కువగా ఉన్నాయి. కానీ మరణాల రేటు తక్కువగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. కరోనా వల్ల పరిశుభ్రత, ఆరోగ్యం విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటున్న కారణంగా డెంగ్యూ బారిన పడినా త్వరగా కోలుకుంటున్నారని చెబుతున్నారు. డెంగ్యూ లో 4 సీరోటైప్స్ ఉంటాయి. మన దగ్గర రెండు వేరియంట్స్ ఉన్నాయని చెబుతున్నారు. 

ఇక తెలంగాణలో  సీరో టైప్ 2 వేరియంట్ ఎక్కువగా కనిపిస్తుంది. దీంతో ఫీవర్ ఆస్పత్రి పూర్తిగా డెంగ్యూ రోగులతో నిండిపోయింది. దీనిమీద డాక్టర్లు మాట్లాడుతూ.. డెంగ్యూలోని నాలుగు టైప్స్ లో.. మామూలుగా తెలుగు రాష్ట్రాల్లో టైప్ వన్ ఎక్కువగా ఉండేది. అయితే టైప్ 2 ఇప్పుడు ఎక్కువవుతుందని అలర్ట్ గా ఉండాలని కేంద్రం నుంచి ఆదేశాలు వచ్చాయని తెలిపారు. 

click me!