భవిష్యత్తు కార్యాచరణ వాయిదా వేసిన కన్నా: ఎందుకో తెలుసా?

Published : Feb 19, 2023, 01:59 PM ISTUpdated : Feb 19, 2023, 04:16 PM IST
 భవిష్యత్తు  కార్యాచరణ వాయిదా వేసిన  కన్నా: ఎందుకో తెలుసా?

సారాంశం

బీజేపీకి రాజీనామా  చేసిన  మాజీ మంత్రి  కన్నా లక్ష్మీనారాయణ  అనుచరులతో   ఇవాళ  సమావేశమయ్యారు. ఈ సమావేశంలో  భవిష్యత్తు  కార్యాచరణపై  చర్చించారు.

గుంటూరు: తన  భవిష్యత్తు  కార్యాచరణపై  ప్రకటనను  వాయిదా  వేసుకున్నట్టుగా   మాజీ మంత్రి  కన్నా లక్ష్మీనారాయణ  ప్రకటించారు. రాష్ట్రంలోని  పలు జిల్లాలకు  చెందిన  అనుచరులతో  మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ  ఆదివారం నాడు గుంటూరులోని  తన నివాసంలో  సమావవేశమయ్యారు.  ఈ సమావేశంలో బీజేపీకి  రాజీనామా, భవిష్యత్తు  కార్యాచరణపై చర్చించారు.

అనుచరులతో  సమావేశం  ముగిసిన తర్వాత కన్నా లక్ష్మీనారాయణ  మీడియాతో మాట్లాడారు.   రెండు రోజుల క్రితమే  ఈ సమావేశం  గురించి  సమాచారం పంపినట్టుగా  చెప్పారు. ఈ సమావేశంలో  అన్ని విషయాలపై చర్చించినట్టుగా  కన్నా లక్ష్మీనారాయణ  చెప్పారు. సినీ నటుడు తారకరత్న మృతి పట్ల విచారం  వ్యక్తం  చేశారు.  తారకరత్న  నటుడిగానే కాదు  మంచి వ్యక్తిగా  గుర్తింపు తెచ్చుకున్నారని ఆయన  అభిప్రాయపడ్డారు. తారకరత్న ఆత్మకు శాంతి  కలగాలని  దేవుడిని  కోరుకుంటున్నట్టుగా  ఆయన  చెప్పారు.  తారకరత్న  మృతి కారణంగా  తన  భవిష్యత్తు  నిర్ణయాలను  ప్రకటించడం  వాయిదా  వేసినట్టుగా  కన్నా లక్ష్మీనారాయణ  తెలిపారు.

ఈ నెల  16వ తేదీన బీజేపీకి  కన్నా లక్ష్మీనారాయణ  రాజీనామా  చేశారు.  బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వైఖరిపై  తీవ్ర అసంతృప్తిని  కన్నా లక్ష్మీనారాయణ వ్యక్తం చేశారు. మీడియా వేదికగా  కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు  చేసిన విషయం తెలిసిందే.   బీజేపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ  శివప్రకాష్ కూడా  మాజీ మంత్రి  కన్నా లక్ష్మీనారాయణతో  చర్చించారు.  అయినా  కూడా  కన్నా లక్ష్మీనారాయణ  బీజేపీకి దూరం కావాలని నిర్ణయం తీసుకున్నారు.   అనుచరులతో సమావేశమై  ఈ నెల  16న రాజీనామా  చేస్తున్నట్టుగా ప్రకటించారు  

ఈ నెల  23వ తేదీన  కన్నా లక్ష్మీనారాయణ  టీడీపీలో  చేరేందుకు ముహుర్తం  ఏర్పాటు  చేసుకున్నారని సమాచారం.  అయితే తారకరత్న  మృతి కారణంగా  ఈ నిర్ణయాన్ని  ప్రకటించడం వాయిదా వేసుకున్నట్టుగా  ఆయన వర్గీయులు  చెబుతున్నారు.

also read:టీడీపీలోకి కన్నా లక్ష్మీనారాయణ :ఈ నెల 23న బాబు సమక్షంలో చేరిక

ఇదిలా ఉంటే  కన్నా లక్ష్మీనారాయణ  టీడీపీలో  చేరడానికి ముందే  క్షమాపణలు  చెప్పాలని  మాజీ ఎంపీ  రాయపాటి సాంబశివరావు డిమాండ్  చేశారు. చంద్రబాబుతో పాటు , తనపై  కన్నా లక్ష్మీనారాయణ  గతంలో  విమర్శలు  చేశారని  ఆయన  గుర్తు  చేశారు.  కన్నా లక్ష్మీనారాయణ  టీడీపీలో  చేరడాన్ని  రాయపాటి సాంబశివరావు  వ్యతిరేకిస్తున్నారు. అందుకే ఈ వ్యాఖ్యలు  చేసినట్టుగా  రాజకీయ పరిశీలకులు  చెబుతున్నారు.  రాయపాటి సాంబశివరావు వ్యాఖ్యలతో  కన్నా లక్ష్మీనారాయణ  ఆలోచనలో  పడ్డారా లేక తారకరత్న మృతితో  ప్రకటనను వాయిదా వేసుకున్నారా  అనే చర్చ  సాగుతుంది.  ఈ విషయమై  రెండు  మూడు  రోజుల్లో స్పష్టత  రానుంది.  

  

PREV
click me!

Recommended Stories

Manchu Family Visits Tirumala: తిరుమల శ్రీవారి సేవలో మంచు ఫ్యామిలీ | Asianet News Telugu
PSLV-C62 EOS-N1 Launch: ఇస్రో ప్రయోగంపై సైంటిస్టులు, స్టూడెంట్స్ రియాక్షన్ | Asianet News Telugu