పోలవరం పవర్ ప్రాజెక్టు పనులేమయ్యాయి: దేవినేని ఉమ

By narsimha lode  |  First Published Mar 10, 2021, 4:40 PM IST

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల విషయంలో వైసీపీ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఆరోపించారు. 


అమరావతి: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల విషయంలో వైసీపీ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఆరోపించారు. 

బుధవారం నాడు విజయవాడలోని టీడీపీ కార్యాలయంలో మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమ మీడియాతో మాట్లాడారు.పోలవరం ప్రాజెక్టును వైసీపీ సర్కార్ భ్రష్టుపట్టించిందన్నారు. పోలవరం డయాఫ్రం వాల్ పనులను హడావుడిగా పూర్తి చేశారన్నారు. పోలవరం పవర్ ప్రాజెక్టు పనులను గాలిలో పెట్టారన్నారు. ఈ ప్రాజెక్టు పనులను  కొట్టేద్దామని ఈ  పనిచేశారని ఆయన విమర్శించారు.

Latest Videos

undefined

పోలవరం పవర్ ప్రాజెక్టు ఏమైందని ఆయన ప్రశ్నించారు. 960 మె.వా. విద్యుత్ ప్రాజెక్టు రెండేళ్లుగా ఎందుకు నిర్మించలేదని ఆయన అడిగారు. పోలవరం ప్రాజెక్టులో కనీసం రూ. 300 కోట్లు కూడ పనులు చేయని చేతగాని ప్రభుత్వం మాపై విమర్శలు చేస్తోందా అని ప్రశ్నించారు.

తమ ప్రభుత్వం చేసిన పనులకు గాను కేంద్రం నుండి ఇంకా రూ. 1400 కోట్లు కేంద్రం నుండి రావాల్సి ఉందన్నారు. 22 మంది ఎంపీలు ఉండి ఈ నిధులను ఎందుకు రాబట్టుకోలేకపోయారని ఆయన ప్రశ్నించారు. మీ ఎంపీలు ఏం చేస్తున్నారో చెప్పాలని ఆయన వైసీపీ నేతలను అడిగారు.

అసమర్ధులకు ప్రభుత్వాన్ని అప్పగించామని ఏపీ ప్రజలు బాధపడుతున్నారని ఆయన చెప్పారు.


 

click me!