ప్రైవేటీకరణకు చంద్రబాబే ఆద్యుడు.. అప్పట్లో ఏకంగా పుస్తకాలే: మంత్రి అనిల్ కుమార్

By Siva KodatiFirst Published Mar 10, 2021, 3:48 PM IST
Highlights

ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్. బుధవారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన విశాఖ ఉక్కు కార్మాగారం విషయంగా వైసీపీపైనా, సీఎం జగన్మోహన్ రెడ్డిపైనా దుష్ప్రచారం చేస్తున్నారంటూ అనిల్ కుమార్ ఎద్దేవా చేశారు

ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్. బుధవారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన విశాఖ ఉక్కు కార్మాగారం విషయంగా వైసీపీపైనా, సీఎం జగన్మోహన్ రెడ్డిపైనా దుష్ప్రచారం చేస్తున్నారంటూ అనిల్ కుమార్ ఎద్దేవా చేశారు.

రామోజీరావు తన సంస్థ షేర్లను ఇష్టానికి అమ్ముకున్నట్లుగానే.. స్టీల్ ప్లాంట్ కేంద్ర సంస్థ కాబట్టి వారి నిర్ణయాన్ని ఏ విధంగా ఆపాలన్నదానిపై జగన్ ప్రయత్నిస్తున్నారని మంత్రి చెప్పారు.

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పునరాలోచించాలని సీఎం రెండు సార్లు మోడీకి లేఖ రాసిన విషయాన్ని అనిల్ కుమార్ ప్రస్తావించారు. పోలవరం డయాఫ్రం వాల్ టీడీపీ హయాంలో నిర్మించారని.. చంద్రబాబు హయాంలో అడ్డదిడ్డంగా నిర్మాణాలు జరిగాయని అనిల్ కుమార్ ఆరోపించారు.

1999 నుంచి 2004 మధ్యకాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు  సీఎంగా వున్నారని.. అప్పుడు రాష్ట్రంలోని 54 సంస్థలను మూసివేయడమో, ప్రైవేటీకరణ చేయడమో జరిగిందని మంత్రి ఆరోపించారు.

ఆల్విన్, నిజాం షుగర్స్ సహా అనేక కో ఆపరేటివ్ సొసైటీలు, పత్తి, షుగర్ మిల్లులు ఈ లిస్ట్‌లో వున్నాయని అనిల్ కుమార్ తెలిపారు. ప్రైవేటీకరణలకు సంబంధించి చంద్రబాబు 2004లోనే పుస్తకం విడుదల చేశారని ఆయన గుర్తుచేశారు.

రాష్ట్రానికి నేను సీఎంను కాదు.. సీఈవోని అన్నట్లు ప్రచారం చేసుకున్న చంద్రబాబు.. ఏ ముఖం పెట్టుకుని గాజువాక సెంటర్లో మాట్లాడారని అనిల్ కుమార్ ఎద్దేవా చేశారు.

చంద్రబాబు, రాధాకృష్ణ, రామోజీరావులు ప్రజలు బాగుపడుతుంటే చూసి తట్టుకోలేరంటూ సెటైర్లు వేశారు. వార్తలు రాసేటప్పుడు వాస్తవాలు తెలుసుకోవాలని అనిల్ కుమార్ మండిపడ్డారు. 

click me!