స్టీల్‌ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకం.. జగన్‌తో కలిసి ప్రధాని దగ్గరకెళ్తా: సుబ్రమణ్యస్వామి

Siva Kodati |  
Published : Mar 10, 2021, 04:24 PM IST
స్టీల్‌ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకం.. జగన్‌తో కలిసి ప్రధాని దగ్గరకెళ్తా: సుబ్రమణ్యస్వామి

సారాంశం

విశాఖ స్టీల్ ప్లాంట్‌‌లో పెట్టుబడుల ఉపసంహరణపై బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే నడుస్తోన్న ప్లాంట్‌ని ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు

విశాఖ స్టీల్ ప్లాంట్‌‌లో పెట్టుబడుల ఉపసంహరణపై బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే నడుస్తోన్న ప్లాంట్‌ని ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.

ఎయిరిండియా ప్రైవేటీకరణను సైతం తాను వ్యతిరేకించినట్లు సుబ్రమణ్యస్వామి గుర్తుచేశారు. ఓ సంస్థలో వాటాలు అమ్మేయాలని భావించినప్పుడు దానికి బలమైన కారణాలు ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.

Also Read:గెలిచినా, ఓడినా పవన్ ప్రజలతోనే..: మాజీ ఎంపి లగడపాటి ఆసక్తికర వ్యాఖ్యలు

అంతేకానీ ప్రభుత్వ ఆస్తులను అమ్ముకుంటూ పోవడానికి తాను వ్యతిరేకమని చెప్పారు స్వామి. ప్రతీదానిని ప్రైవేటీకరణ చేస్తామనే విధానం మంచిది కాదని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం వ్యాపారం చేయొచ్చా లేదా అనేది కేస్ బై కేస్ చూడాలని స్వామి సూచించారు.

స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రధానిని కలిసేటప్పుడు జగన్‌తో పాటు తాను కూడా వెళ్తానని సుబ్రమణ్యస్వామి వెల్లడించారు. ప్రభుత్వ రంగ సంస్థలను గుడ్డిగా ప్రైవేటీకరణ చేయడంపై తాను వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు. అంతకుముందు ముఖ్యమంత్రి జగన్‌ను సుబ్రమణ్యస్వామి కలిశారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే