మూడు రాజధానులపై రెఫరెండానికి సిద్దం: మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు

By narsimha lodeFirst Published Sep 18, 2022, 3:25 PM IST
Highlights

మూడు రాజధానులపై రెఫరెండానికి తాము సిద్దంగా ఉన్నామని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు చెప్పారు. ఈ విషయమై మంత్రి అమర్ నాథ్  చేసిన సవాల్ కు కట్టుబడినట్టుగా చెప్పారు.

 

విశాఖపట్టణం: మూడు రాజధానులపై రెఫరెండానికి తాము సిద్దమని మాజీ మంత్రి, టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. ఆదివారం నాడు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మీడియాతో మాట్లాడారు. మూడు రాజధానుల విషయమై ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ ఇటీవల లీడీపీపై విమర్శలు చేశారు. మూడు రాజధానుల  అంశంపై రెఫరెండానికి సిద్దమని  ఆయన ప్రకటించారు.  దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయాలని  మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు  చెప్పారు. మూడు రాజధానుల అంశంపై ఎన్నికలకు వెళ్తామని ఆయన తెలిపారు.  

అమరావతి భూములు దోచుకుంటున్నారని  మా పార్టీపై నిందలు వేస్తున్నారన్నారు.  దమ్ముంటే అమంత్రి అమర్ నాథ్ తన సవాల్ ను స్వీకరించాలని ఆయన కోరారు. మూడు రాజధానులపై రెఫరెండానికి తాము సిద్దంగా ఉన్నామని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు చెప్పారు. ఈ విషయమై మంత్రి అమర్ నాథ్  చేసిన సవాల్ కు కట్టుబడినట్టుగా చెప్పారు.పరిపాలనా వికేంద్రీకరణకే తాము కట్టుబడి ఉన్నామని వైసీపీ సర్కార్ ప్రకటించింది. రెండు రోజుల క్రితం ఏపీ అసెంబ్లీలో జరిగిన చర్చలో ప్రభుత్వం ఈ విషయమై స్పష్టం చేసింది. పరిపాలనా వికేంద్రీకరణతో అభివృద్ది సాధ్యమని ఏపీ సీఎం జగన్ చెప్పారు. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల అంశాన్ని తెరమీదికి తీసుకు వచ్చింది. 

మూడు రాజధానులపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో  ఏపీ ప్రభుత్వం  పిటిషన్ దాఖలు చేసింది. పరిపాలనా వికేంద్రీకరణకు  తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ మంత్రి అమర్ నాథ్ స్పష్టం చేశారు. అన్కి ప్రాంతాలకు న్యాయం చేయాలనే ఉద్దేశ్యంతోనే తమ ప్రభుత్వం హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ  సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయాన్ని రెండు రోజుల క్రితం మీడియా సమావేశంలో అమర్ నాథ్ ప్రకటించిన విషయం తెలిసిందే.

మూడు రాజధానులను వైసీపీ మినహా మిగిలిన రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. అమరావతిఒక్క రాజధానినే కొనసాగించాలని కోరుతున్నాయి. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని కోరుతూ  అమరావతి పరిరక్షణ జేఏసీ చేపట్టిన ఆందోళనలు వెయ్యి రోజులు పూర్తి చేసుకున్నాయి.దీంతో ఈ నెల 12వ తేదీ నుండి అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ ఆద్వర్యంలో రైతులు అమరావతి నుండి అరసవెల్లికి పాదయాత్ర ప్రారంభించారు.ఈ పాదయాత్రకు ఏపీ హైకోర్టు అనుమతిని ఇచ్చింది. 

click me!