ఫోన్ మిస్సింగ్.. మాకు దొరికిందంటూ పిలిచి మహిళపై నలుగురి అత్యాచారం, హత్య

Siva Kodati |  
Published : Sep 18, 2022, 02:37 PM IST
ఫోన్ మిస్సింగ్.. మాకు దొరికిందంటూ పిలిచి మహిళపై నలుగురి అత్యాచారం, హత్య

సారాంశం

పల్నాడు జిల్లా మాచర్లలో ఓ మహిళపై నలుగురు అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. 

పల్నాడు జిల్లా మాచర్లలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళపై నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. రెండ్రోజుల క్రితం ఓ మహిళ సెల్‌ఫోన్ పోయింది. అయితే అదే గ్రామానికి చెందిన కొందరు ఆమెకు ఫోన్ చేసి.. వూరు బయటకు తీసుకెళ్లారు. అనంతరం మహిళపై అఘాయిత్యానికి పాల్పడి, హత్య చేశారు. శనివారం రాత్రి నుంచి మహిళ  కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకగా... గ్రామ శివార్లలోని వాగు వద్ద శవమై కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మృతురాలికి నలుగురు కుమార్తెలు వున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Vijaysai Reddy Sensational Comments On YS Jagan | Asianet News Telugu
Annadata Sukhibhava: రైతుల‌కు ద‌స‌రా కానుక‌.. ఖాతాల్లోకి రూ. 6000 జ‌మ‌, ఎప్పుడంటే.?