వచ్చే ఎన్నికల్లో గెలిచే అభ్యర్ధులకే టికెట్లు: పవన్ కళ్యాణ్

By narsimha lodeFirst Published Sep 18, 2022, 2:16 PM IST
Highlights

వచ్చే ఎన్నికల్లో గెలిచే అభ్యర్ధులకే టికెట్లు కేటాయిస్తామని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇవాళ గుంటూరులో జరిగిన లీగల్ సెల్ సమావేశంలో పవన్  కళ్యాణ్ ఈ విషయాన్ని తెలిపారు.  
 


అమరావతి : గెలిచే అభ్యర్ధులకే టికెట్లు కేటాయించాలని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్  నిర్ణయం తీసుకున్నారు.  ఈ మేరకు నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించ,నున్నారు. వచ్చే నెల నుండి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించనున్నారు. విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించనున్నారు.  బస్సు యాత్ర లోపుగానే  పార్టీనిసంస్థాగంగా బలోపేతం చేయాలని భావిస్తున్నారు జనసేనాని.  ఆయా నియోజకవర్గాల్లో ఏ అభ్యర్ధి ప్రత్యర్ధులకు గట్టి పోటీని ఇవ్వనున్నారనే విషయమై పార్టీ సమీక్ష సమావేశాల్లో చర్చించనున్నారు.  

వచ్చే ఎన్నికల్లో వైసీపీని అధికారంలోకి రాకుండా ఉండేందుకు గాను  విపక్షాల ఓటు చీలకుండా ప్రయత్నం చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. బీజేపీతో జనసేన మధ్య పొత్తు ఉంది. వచ్చే ఎన్నికల్లో తాము కలిసి పోటీ చేస్తామని  బీజేపీ నేతలు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇతరపార్టీలతో పొత్తుల విషయమై పొత్తులపై రాష్ట్ర రాజకీయాల్లో ఊహగానాలు సాగుతున్నాయి. ఎన్నికల సమయం నాాటికి  ఈ విషయమై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 

also read:కారణమిదీ: పవన్ కళ్యాణ్ యాత్ర వాయిదా

గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన నుండి రాజోలు నుండి రాపాక వరప్రసాద్ విజయం సాధించారు. అయితే ఎన్నికల తర్వాత రాపాక వర ప్రసాద్ వైసీపీకి జై కొట్టారు. అయతే వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించాలని జనసేన భావిస్తుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచే అభ్యర్ధులను బరిలోకి దింపాలని జనసేనాని భావిస్తున్నారు. ఇవాళ గుంటూరులో నిర్వహించిన జనసేన లీగల్ సెల్ సమావేశంలో ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.

click me!