కేసీఆర్ తెలంగాణను చూసుకొంటే మంచిదని ఏపీ మాజీ మంత్రి పేర్నినాని కోరారు. బీఆర్ఎస్ ఏపీలో ఎంట్రీపై పేర్ని నాని స్పందించారు.
అమరావతి: కేసీఆర్ తెలంగాణ చూసుకుంటే మంచిదని ఏపీ మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యేపేర్నినాని సూచించారు.'సోమవారం నాడు నాని మీడియాతో మాట్లాడారు. ఏపీకి ద్రోహం చేసింది తెలంగాణ నేతలేనన్నారు. తెలంగాణ మంత్రులు భయంతో ఉన్నారన్నారు. మోడీ, అమిత్ షా వస్తారని తెలంగాణ మంత్రులు భయంతో ఉన్నారని ఆయన చెప్పారు. గతంలో తెలంగాణ మంత్రులు చేసిన వ్యాఖ్యలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.
. ఏపీ రాష్ట్రాన్ని ఏం ఉద్దరిస్తారని పేర్ని నాని తెలంగాణ నేతలనుద్దేశించి ప్రశ్నించారు. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల డ్యామ్ ల నుండి దొంగ కరెంట్ తీసుకుంటున్నారని ఆయన విమర్శించారు..ప్రాజెక్టుల్లోని నీటిని వృధాగా సముద్రంలోకి విడుదల చేస్తున్నారని పేర్నినాని తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇలాంటి వాళ్లు ఏపీని ఉద్ధరిస్తారా అని పేర్ని నాని బీఆర్ఎస్ నేతలనుద్దేశించి వ్యాఖ్యానించారు.
undefined
తమ రాష్ట్రానికి చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలను ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలన్నారు.. ఏపీకి చెందిన ఆస్తులు పంచారా, తమ రాష్ట్రానికి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చారా అని ఆయన ప్రశ్నించారు. ఏపీలో బీఆర్ఎస్ పోటీ చేయడంలో తప్పు లేదన్నారు. ఏ పార్టీ అయినా, ఏ నేత అయినా ఎక్కడి నుండైనా పోటీ చేయవచ్చన్నారు. గతంలో కేఏ పాల్ , పార్టీ, పిరమిడ్ పార్టీలు రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో పోటీ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
గుంటూరు తొక్కిసలాటలో ముగ్గురి మరణంతో ప్లేట్ ఫిరాయించారు
చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చితో ముగ్గురు అమాయకులు ప్రాణాలు కోల్పోయారని మాజీ మంత్రి పేర్నినాని చెప్పారు.. గుంటూరు సభకు టీడీపీ నేతలు అనుమతి తీసుకున్నారని ఆయన గుర్తు చేశారు. గుంటూరు సభలో తొక్కిసలాటలో ముగ్గురు మరణించడంతో టీడీపీ నేతలు మాట మార్చారని ఆయన విమర్శించారు.
పదివేల మందికి సంక్రాంతి కానుకలు ఇస్తామని పోలీసులతో అనుమతి తీసుకుని 30వేల మందికి టోకెన్లు పంచారన్నారు. చంద్రబాబు తన దిక్కు మాలిన ప్రచార యావ కోసం రాష్ట్రంలో అమాయక జనాల ప్రాణాలతో ఆడుకుంటున్నారన్నారు.. చంద్రన్న సంక్రాంతి కానుక సభ అనుమతి కోసం ఆ పార్టీ నాయకుడు డీఎస్పీకి రాసిన లేఖలో 10 వేల మంది అని రాశారని పేర్నినాని చెప్పారు.అంతేకాకుండా 30 వేల టోకెన్లు పంచినట్లు కూడా చెప్పారు. కానీ, తీరా సభలో మనుషుల ప్రాణాలు పోయాక తమకు సంబంధం లేదని ప్లేటు ఫిరాయిస్తున్నారని ఆయన విమర్శించారు.
ఆ సభ ఎన్నారైలు నిర్వహించిన సభ అని అబద్దాలు చెబుతున్నారు. అలాంటప్పుడు అనుమతులు పార్టీ నాయకుడు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో చెప్పాలని పేర్ని నాని ప్రశ్నించారు. గుంటూరు తొక్కిసలాటలో ముగ్గురు మరణిస్తే ఎల్లో మీడియా ఏ మాత్రం భాద్యతగా స్పందించలేదని ఆయన విమర్శించారు..