ఈ నెల 12న శ్రీకాకుళంలో యువశక్తి సభ: పోస్టర్ ను ఆవిష్కరించిన పవన్ కళ్యాణ్

Published : Jan 02, 2023, 05:34 PM IST
ఈ నెల  12న  శ్రీకాకుళంలో యువశక్తి సభ: పోస్టర్ ను ఆవిష్కరించిన  పవన్ కళ్యాణ్

సారాంశం

ఈ నెల  12న  శ్రీకాకుళంలో  యువశక్తి సభను నిర్వహించనున్నట్టుగా  జనసేన చీప్ పవన్ కళ్యాణ్ ప్రకటించారు.  యువత సమస్యలను ఈ సభలో  చర్చించనున్నట్టుగా  పవన్ కళ్యాణ్  వివరించారు.

హైదరాబాద్: ఈ నెల  12న  శ్రీకాకుళంలో  యువశక్తి సభను నిర్వహించనున్నట్టుగా  జనసేన చీఫ్  పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ మేరకు సోమవారం నాుడు హైద్రాబాద్ లో  శ్రీకాకుళంలో నిర్వహించే  యువశక్తి సభ పోస్టర్ ను  జనసేన చీఫ్  పవన్ కళ్యాణ్  ఆవిష్కరించారు. యువత ఎదుర్కొంటున్న సమస్యలపై  ఈ సభలో  చర్చించనున్నట్టుగా  జనసేనాని ప్రకటించారు. 

వచ్చే ఎన్నికల్లో  ఏపీ రాష్ట్రంలో  వైసీపీని అధికారంలోకి రాకుండా అడ్డుకుంటామని  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్  ప్రకటించారు. ఈ మేరకు  పార్టీని  సంస్థాగతంగా బలోపేతం చేసే కార్యక్రమాన్ని ఆ పార్టీ తీసుకుంది.  పార్టీకి ఆయువుపట్టుగా  ఉన్న యువతలో  జోష్ పెంచేందుకు గాను  జనసేన  నాయకత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలోనే  యువశక్తి పేరుతో సభను ఏర్పాటు చేసింది.  తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే  యువతకు ఏం చేయనున్నామనే విషయాన్ని  జనసేన ఈ సభ ద్వారా వివరించనుంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం