కాపు రిజర్వేషన్లకై నిరహార దీక్ష: పవన్ వినతి మేరకు విరమించిన హరిరామ జోగయ్య

Published : Jan 02, 2023, 06:04 PM ISTUpdated : Jan 02, 2023, 07:08 PM IST
కాపు రిజర్వేషన్లకై నిరహార దీక్ష: పవన్ వినతి మేరకు  విరమించిన హరిరామ జోగయ్య

సారాంశం

కాపుల రిజర్వేషన్ల సాధన కోసం  దీక్ష చేస్తున్న మాజీ మంత్రి హరిరామ జోగయ్య  ఇవాళ సాయంత్రం దీక్షను విరమించారు. 

ఏలూరు: కాపుల రిజర్వేషన్  సాధన కోసం  ఆమరణ నిరహార దీక్ష చేస్తున్న  మాజీ మంత్రి  హరిరామ జోగయ్య  తన దీక్షను సోమవారం నాడు సాయంత్రం విరమించారు.  ఆదివారం నాడు రాత్రి  మాజీ మంత్రి హరిరామ జోగయ్య దీక్షను భగ్నం చేసి  ఆసుపత్రికి తరలించారు.  ఆసుపత్రిలో ఆయన   దీక్షను కొనసాగిస్తున్నారు.  దీక్షను విరమించాలని జనసేన చీఫ్  పవన్ కళ్యాణ్ మాజీ మంత్రి హరిరామ జోగయ్యను కోరారు. దీంతో  హరిరామ జోగయ్య  తన దీక్షను విరమించారు.

ఇవాళ సాయంత్రం పవన్ కళ్యాణ్ ఫోన్ లో మాట్లాడారు. దీక్షను విరమించాలని  పవన్ కళ్యాణ్ కోరారు.  ఏపీ రాష్ట్రంలో  కాపులకు  ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించాలని  ప్రభుత్వాన్ని డిమాండ్  చేశారు. కాపులకు రిజర్వేషన్ విషయమై  గత ఏడాది డిసెంబర్  30వ తేదీ లోపుగా స్పందించాలని  ప్రభుత్వానికి ఆయన డెడ్ లైన్ విధించారు.ఈ డెడ్ లైన్ లోపుగా ప్రభుత్వం స్పందించలేదు. దీంతో తాను  నిరవధిక దీక్షకు దిగుతానని గతంలో ప్రకటించినట్టుగానే  ఆయన  దీక్షకు దిగారు.  ఆదివారం నాడు రాత్రి  హరిరామజోగయ్యను దీక్షను భగ్నం చేశారు.  మాజీ మంత్రి హరిరామ జోగయ్యను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో కూడా దీక్షను ఆయన కొనసాగించారు.   వయసు  రీత్యా దీక్షను విరమించాలని  హరిరామజోగయ్యను పవన్ కళ్యాణ్ కోరారు. పవన్ కళ్యాణ్  వినతి మేరకు   హరిరాజమజోగయ్య దీక్షను విరమించారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IAS Amrapali Kata Speech: విశాఖ ఉత్సవ్ లో ఆమ్రపాలి పవర్ ఫుల్ స్పీచ్ | Asianet News Telugu
Visakha Utsav Curtain Raiser Event: హోం మంత్రి అనిత సెటైర్లు | Asianet News Telugu