విదేశీ పర్యాటకులను అకట్టుకుంటున్న ఆంధ్ర

Published : Oct 25, 2016, 12:28 PM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
విదేశీ పర్యాటకులను అకట్టుకుంటున్న  ఆంధ్ర

సారాంశం

మొదటి ఎనిమిది నెలల్లో 2,51,458 నెంబర్ వన్ స్థానంలో అనంతపురం జిల్లా రెండు, మూడు స్థానాల్లో విశాఖ, కృష్ణా జిల్లాలు

పెట్టుబడులేమోగాని, ఆంధ్రదేశాన్ని చూసేందుకు విదేశీ పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు వరకు విదేశీ పర్యాటకులు ఏపీలో విస్తృతంగా పర్యటించినట్లు టూరిజం శాఖ చెబుతూ ఉంది.

రాష్ట్రంలో ఈ ఏడాది ఆగస్టు వరకు వచ్చిన విదేశీ పర్యాటకులు 2,51,458గా ఉన్నారు. అనంతపురం జిల్లాకు 2016లో ఇప్పటి వరకు 1,81,144 మంది పర్యటించారు. గత ఏడాదిలో అనంతపురం జిల్లాలో మొత్తం లక్షా 37 వేల 847 మంది హాజరయ్యారు. ఆ సంఖ్య ఈ ఏడాది ఇప్పటికే మించిపోయింది. విశాఖ జిల్లాకు 47817 మంది విదేశీ యాత్రికులు పర్యటించారు. కృష్ణా జిల్లాకు ఇప్పటి వరకు 7486 మంది విదేశీ పర్యాటకులు విచ్చేశారు. 

కనువిందు చేస్తున్న లేపాక్షి అందాలు

 అనంతపురం జిల్లాలోని లేపాక్షి అందాలకు విదేశీ పర్యాటకుల మనసు దోచేస్తున్నాయి. లేపాక్షి ఆలయాన్ని దర్శించడానికి విదేశీ పర్యాటకులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. విజయనగర సామ్రాజ్య వైభవానికి చిహ్నంగా ఉండే శిల్ప సంపద పర్యాటకలకు ఆహ్లాదాన్ని కలిగిస్తోంది. నాగలింగేశ్వర స్వామి ఆలయం, నంది విగ్రహం పర్యటకులకు మైమరపింపజేస్తున్నాయ్. ఈ నందితోపాటు, అక్కడ సహజంగా చెప్పిన శిల్పాలు విదేశీ పర్యాటకలకు అమితానందనాన్ని కలిగిస్తున్నాయ్. 

విశాఖపట్టణం

సింహాచలంలోని అప్పన్న స్వామి ఆలయానికి విదేశీ పర్యాటకులు పెద్ద సంఖ్యలో హాజరువుతున్నారు. వీరితో పాటు ఒరిస్సా, బెంగాల్ నుంచి విశాఖకు భారీగా పర్యాటకులు వస్తున్నారు.  పర్యాటకులను ఆకర్షించడంలో విశాఖ నెంబర్ 2వ స్థానంలో ఉండటం విశేషం. అప్పన్న దేవాలయానికి పర్యాటక శాఖ అంచనాల ప్రకారం ప్రపంచంలోని నలుమూలల నుంచి యాత్రికులు వస్తున్నారు.

కృష్ణా జిల్లా

కృష్ణా జిల్లాలోనూ ఈ ఏడాది భారీగా విదేశీయులు పర్యటించారు. 7486 మంది పర్యాటకులు జిల్లాలో పర్యటించారు. ప్రపంచ ప్రసిద్ధ చెంపిన దుర్గా టెంపుల్ తోపాటు, భవానీ ద్వీపానికి పర్యాటకలు హాజరవుతున్నారు. రాజధాని ప్రాంతంగా కూడా విజయవాడ విరాజిల్లుతుండటంతో విదేశీ కంపెనీల ప్రతినిధులు భారీగా వస్తున్నారు. 

గత ఏడాది ఇదే సమయానికి రాష్ట్రానికి వచ్చిన పర్యాటకులు సంఖ్య లక్షా 8 వేల 591 మందిగా ఉండగా ఈ ఏడాది ఆ సంఖ్య 2,51,458గా ఉంది. ఆ లెక్క రాష్ట్రానికి లక్షా 42 వేల 867 మంది పర్యాటకులు పెరిగారు. పర్యాటకులు భారీగా వస్తున్న అనంతపురం, విశాఖ, కృష్ణా జిల్లాల మరిన్ని సౌకర్యాలు, వసతులు కల్పించి పెద్ద ఎత్తున విదేశీ మారద ద్రవ్యాన్ని రాబట్టుకోవాలని పర్యాటక శాఖ కృషిచేస్తోంది. 

 

 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?