శ్రీశైలంలో అగ్నిప్రమాదం.. 15 దుకాణాలు దగ్ధం..

Published : Aug 31, 2023, 08:14 AM IST
శ్రీశైలంలో అగ్నిప్రమాదం.. 15 దుకాణాలు దగ్ధం..

సారాంశం

ఏపీలోని శ్రీశైలంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఇందులో 15 దుకాణాలు దగ్ధం అయ్యాయి. దాదాపు రూ.2 కోట్ల ఆస్తి నష్టం వాటిళ్లింది. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

శ్రీశైలంలో అగ్నిప్రమాదం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 15 దుకాణాలు దగ్ధం అయ్యాయి. ఆలయ సమీపంలో ఉన్న ఎల్ బ్లాక్ కాంప్లెక్స్ లోని లలితాంబికా దుకాణంలో బుధవారం అర్ధరాత్రి దాటక మంటలు మొదలయ్యాయి. కాసేపట్లనే అవి కాంప్లెక్స్ లోని పలు దుకాణాలకు వ్యాపించాయి. 

ఇల్లెందు నుంచి పోటీ చేస్తా.. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతా - మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య కూతురు అనురాధ

దీనిపై సమాచారం అందగానే వెంటనే ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకున్నాయి. వెంటనే మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. కాగా.. ఈ ఘటనలో 15 దుకాణాలు దహనం అయ్యాయి. ప్రమాద స్థలానికి ఆలయ ఈవో లవన్న చేరుకున్నారు. అక్కడి పరిస్థితిని పరిశీలించారు. అయితే ఈ ప్రమాదంలో దాదాపు రూ.2 కోట్ల ఆస్తి నష్టం వాటిళ్లందని అధికారులు చెబుతున్నారు. కాగా.. షార్ట్ సర్క్యూట్ వల్లే నిప్పు రవ్వలు పడి, మంటలు మొదలై ఉంటాయని అధికారులు భావిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్