శ్రీకాళహస్తి ఆలయానికి పోటెత్తిన భక్తులు.. క్యూలైన్‌లో కొట్లాట, మంత్రి పెద్దిరెడ్డి సమక్షంలోనే

Siva Kodati |  
Published : Oct 25, 2022, 06:26 PM IST
శ్రీకాళహస్తి ఆలయానికి పోటెత్తిన భక్తులు.. క్యూలైన్‌లో కొట్లాట, మంత్రి పెద్దిరెడ్డి సమక్షంలోనే

సారాంశం

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఆలయంలో సూర్యగ్రహణం సందర్భంగా దర్శనానికి వెళ్లిన భక్తులు.. క్యూలైన్‌లో కొట్టుకున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో ఈ గొడవ జరిగింది. 

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఆలయంలో ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. సూర్యగ్రహణం సందర్భంగా దర్శనానికి వెళ్లిన భక్తులు.. క్యూలైన్‌లో కొట్టుకున్నారు. దర్శనానికి వెళ్లే సమయంలో మాటా మాటా పెరిగి కొట్టుకున్నారు. దీంతో క్యూలైన్‌లో గందరగోళం నెలకొంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో ఈ గొడవ జరిగింది. దీంతో ఆయన వెంటనే స్పందించి అధికారులకు ఆదేశాలిచ్చారు. రంగంలోకి దిగిన ఆలయ అధికారులు, పోలీసులు భక్తులకు నచ్చజెప్పి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Andhra pradesh: ఏపీ ప్ర‌జ‌ల‌కు గుడ్ న్యూస్‌.. ఆగ‌స్టు 7న‌ ఒక్కో కుటుంబానికి రూ. 25 వేల ఆర్థిక సాయం
August Long Weekends : ఆగస్ట్ లో ప్రతి వీక్ లాంగ్ వీకెండ్... ఏ వారం, ఎన్ని సెలవులో తెలుసా?