ప్యాలస్ పిల్లి చీప్ ట్రిక్స్.. అలాంటి వాళ్లని చెప్పుతో కొట్టండి : జగన్ టార్గెట్‌గా నారా లోకేశ్ వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Oct 25, 2022, 05:21 PM ISTUpdated : Oct 25, 2022, 05:26 PM IST
ప్యాలస్ పిల్లి చీప్ ట్రిక్స్.. అలాంటి వాళ్లని చెప్పుతో కొట్టండి : జగన్ టార్గెట్‌గా నారా లోకేశ్ వ్యాఖ్యలు

సారాంశం

కులం, మతం పేరుతో రాజకీయం చేస్తే చెప్పుతో కొట్టాలన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్. కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు ఐప్యాక్ గ్యాంగ్స్, పేటీఎం గ్యాంగ్స్‌ రంగంలోకి దిగాయని లోకేశ్ ఎద్దేవా చేశారు.   

టీడీపీ ఎమ్మెల్యే, టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ తాజా చిత్రంపై కొందరు సోషల్ మీడియాలో చేస్తున్న వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. బాలయ్య సినిమాలు అగ్రవర్ణాలకు సింబాలిక్‌గా వున్నాయంటూ పిచ్చి రాతలు రాస్తున్నారు. దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు ట్వీట్‌ను ఫేక్ పోస్ట్‌గా ప్రకటించారు . అంతటితో ఆగకుండా ఇలాంటి వ్యవహారశైలి వైసీపీదేనని ఆరోపించారు. ఇదే సమయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ , ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌లపై నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన వరుస ట్వీట్లు చేశారు. 

‘‘ ప్యాలస్ పిల్లి చీప్ ట్రిక్స్..! కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ఐప్యాక్ గ్యాంగ్స్, పేటిఎం డాగ్స్ రంగంలోకి దిగాయి తస్మాత్ జాగ్రత్త! కులం, మతం పేరు చెప్పి రాజకీయం చేసే వారిని చెప్పుతో కొట్టండి ’’. ‘‘ ఫేక్ అకౌంట్స్, ఫేక్ ట్వీట్స్ నీకు ఆత్మసంతృప్తిని ఇస్తాయేమో కానీ  నిన్ను ఓటమి నుండి తప్పించలేవు జగన్ రెడ్డి’’... అంటూ నారా లోకేష్ వార్నింగ్ ఇచ్చారు. 

Also Read:చంద్రబాబు తోఫాలిస్తే.. జగన్ ధోకా , ప్రభుత్వంపై పోరాడండి : మైనార్టీలకు టీడీపీ ఎమ్మెల్యే అనగాని పిలుపు

అంతకుముందు ఆదివారం టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ... ఏపీ సీఎం వైఎస్ జగన్ మైనారిటీ ద్రోహీ అన్నారు. మైనార్టీ సంక్షేమానికి జగన్ మంగళం పాడారని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వం ముస్లీంలను ఓటు బ్యాంకుగా వాడుకుందని... మైనార్టీలకే ఖర్చు చేయాల్సిన రూ.1,683.62 కోట్ల నిధులు దారి మళ్లాయని సత్యప్రసాద్ ఆరోపించారు. మైనార్టీ సంక్షేమాన్ని కాగితాలకే పరిమితం చేశారని... పథకాల్లో భారీగా కోత విధించాని అనగాని దుయ్యబట్టారు. 

టీడీపీ మైనార్టీలకు తోఫాలిస్తే... జగన్ మైనార్టీలకు ధోకా చేశారని సత్యప్రసాద్ సెటైర్లు వేశారు. ఏటా 15 వేలమంది ముస్లింలకు చంద్రబాబు ఫైనాన్స్‌ కార్పొరేషన్లతో లబ్ది చేకూర్చారని... టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో మైనార్టీలకు వినూత్న పథకాలు పెడితే వైసీపీ తుంగలో తొక్కిందని ఆయన ఫైర్ అయ్యారు. మైనార్టీ కార్పొరేషన్‌ను, స్కిల్ డెవలప్ సెంటర్‌లను నిర్వీర్యం చేశారని సత్యప్రసాద్ ఎద్దేవా చేశారు. మూడున్నరేళ్లల్లో 63 మంది ముస్లీంలపై దాడులు జరిగాయని... టీడీపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా దర్గాలు, మసీదులు, ఖబరస్థాన్లు కట్టిస్తే.. నేడు రక్షణ లేదని సత్యప్రసాద్ దుయ్యబట్టారు. మైనార్టీలందరూ ప్రభుత్వంపై సమైక్యంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Legendary Actor Krishnam Raju 86th Birth Anniversary | Free Mega Diabetes Camp | Asianet News Telugu
Tirupati: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. తిరుప‌తి ప‌రిస‌ర ప్రాంతాల సంద‌ర్శ‌న‌కు ప్ర‌త్యేక ప్యాకేజీలు