ఎన్టీఆర్ జిల్లాలో విషాదం: రైలుకింద పడి తండ్రీకొడుకుల ఆత్మహత్య

Published : Oct 25, 2022, 04:54 PM ISTUpdated : Oct 25, 2022, 05:26 PM IST
ఎన్టీఆర్ జిల్లాలో విషాదం:  రైలుకింద  పడి  తండ్రీకొడుకుల ఆత్మహత్య

సారాంశం

ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరానికి చెందిన తండ్రీకొడుకులు  మంగళవారం నాడు రైలు  కింద  పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. 

విజయవాడ: ఎన్టీఆర్  జిల్లాలోని మైలవరానికి  చెందిన తండ్రీ కొడుకులు  మంగళవారంనాడు  ఆత్మహత్య చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని  రేమిడిచర్ల వద్ద రైలు కింద  పడి ఆత్మహత్య  చేసుకున్నారు. తండ్రీ కొడుకులు తెలంగాణకు వచ్చి ఆత్మహత్య చేసుకోవడం ప్రస్తుతం చర్చకు  దారి తీసిందిఈ విషయమై  పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.తండ్రీకొడుకులు ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.ఈ ఘనటకు సంబంధించి  బాధిత  కుటుంబ సభ్యుల పిర్యాదు  మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు  చేస్తున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి రోజూ  ఆత్మహత్యల కేసులు నమోదౌతూనే ఉన్నాయని గణాంకాలు   చెబుతున్నాయి. ఆర్ధిక ఇబ్బందులు,  కుటుంబ కలహల నేపథ్యంలో ఆత్మహత్యలు చేసుకొన్న ఘటనలు నెలకొన్నాయి.  విశాఖపట్టణంలో ఇటీవలనే భార్యాభర్తలకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్న సమయంలోనే  భార్య పోలీస్ స్టేషన్ ముందే  పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య  చేసుకుంది. ఈ నెల 20వ  ఈ ఘటన చోటుచేసుకుంది.

పెళ్లి చేసుకున్న నాలుగు మాసాల తర్వాత వివాహిత ఆత్మహత్య చేసుకుంది.ఈ నెల 19న విశాఖపట్టణంలోని లాడ్జీలో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రేమ  జంట  లాడ్జీలో కిటీకి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.హైద్రాబాద్ చందానగర్ లో ఒకే కుటుంబానికి  చెందిన  నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు.ఈ నెల 17న  ఈ ఘటన చోటు చేసుకుంది.మరోవైపు లోన్ యాప్  సంస్థల వేధింపులు భరించలేక  పలువురు ఆత్మహత్యలకు  పాల్పడిన  ఘటనలు కూడ  రెండు తెలుగు రాష్ట్రాల్లో  నమోదయ్యాయి.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్