అంబులెన్స్ మాఫియా నిరాకరించడంతో బైక్ పైనే తన కొడుుకు మృతదేహన్ని 90 కి. మీ దూరంలోని తన స్వగ్రామానికి తీసుకెళ్లాడు తండ్రి. ఈ ఘటన చిత్తూరు జిల్లా తిరుపతిలో చోటు చేసుకొంది.
తిరుపతి:కొడుకు మృతదేహన్ని తీసుకెళ్లేందుకు Ruia ఆసుపత్రి అంబులెన్స్ సిబ్బంది నిరాకరించడంతో Bike పైనే 90 కి.మీ దూరం కొడుకు మృతదేహన్ని తండ్రి తీసుకెళ్లాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా Tirupatiలో చోటు చేసుకొంది.
Annamaiah జిల్లాలోని Chitvel గ్రామానికి చెందిన బాలుడు కిడ్నీ సంబంధిత వ్యాధితో రుయా ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. చికిత్స పొందుతూ సోమవారం నాడు రాత్రి ఆ బాలుడు చనిపోయాడు. ఈ మృతదేహన్ని తీసుకెళ్లేందుకు రుయా ఆసుపత్రిలోని ambulance డ్రైవర్లను చిన్నారి తండ్రి సంప్రదించాడు. చిట్వేల్ గ్రామానికి ఈ డెడ్ బాడీని తీసుకెళ్లేందుకు రూ. 20 వేలు డిమాండ్ చేశారు. దీంతో తిరుపతి పట్టణంలో మరో అంబులెన్స్ ను చిన్నారి తండ్రి తీసుకొచ్చాడు. అయితే ఈ అంబులెన్స్ ను రుయా ఆసుపత్రిలోకి అంబులెన్స్ మాఫియా రానివ్వలేదు.
undefined
Ruia ఆసుపత్రిలోని సెక్యూరిటీ సిబ్బంది కూడా అంబులెన్స్ ను రానివ్వలేదు. ఈ అంబులెన్స్ డ్రైవర్ పై కూడా రుయా ఆసుపత్రి వద్ద పనిచేసే డ్రైవర్లు ప్రయత్నించారు. దీంతో ఆ అంబులెన్స్ డ్రైవర్ తన వాహనాన్ని తీసుకొని వెళ్లి పోయాడు. దీంతో తన కొడుకు డెడ్ బాడీని తీసుకెళ్లేందుకు ఆ వ్యక్తి ఆసుపత్రి వద్ద తనకు తెలిసిన వారి టూ వీటర్ ను తీసుకొన్నాడు. టూ వీలర్ పై 90 కి.మీ దూరంలోని స్వగ్రామానికి కొడుకు డెడ్ బాడీని తీసుకెళ్లాడు.
ఎస్పీకి ఫిర్యాదు చేసిన అంబులెన్స్ యజమాని
బాలుడి డెడ్ బాడీని తీసుకెళ్లేందుకు బయటి నుండి వచ్చిన అంబులెన్స్ డ్రైవర్ పై దాడి చేయడానికి ప్రయత్నించిన ఘటనపై ఎస్పీకి పిర్యాదు చేశాడు అంబులెన్స్ యజమాని.. రుయా ఆసుపత్రి వద్ద జరిగిన ఘటనకు సంబంధించి తమ డ్రైవర్ తనకు సమాచారం ఇవ్వడంతో వెంటనే ఎస్పీకి సమాచారం పంపినట్టుగా ఆయన చెప్పారు. అయితే ఎస్పీ తనకు డీఎస్పీ ఫోన్ నెంబర్ ఇచ్చారన్నారు. అయితే అప్పటికే రాత్రి కావడంతో ఈ విషయమై పోలీసు అధికారులతో సంప్రదింపులు జరపలేదన్నారు.
గతంలో కూడా మృతదేహలను బైక్ పై తీసుకెళ్లిన ఘటనలు కూడా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో భుజాలపై మోసుకెళ్లిన ఉదంతాలు కూడా దేశ వ్యాప్తంగా జరిగాయి. కరోనా సమయంలో ఈ తరహా ఘటనలు ఎక్కువగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో అనారోగ్యంతో మహిళ మృతి చెందింది. అంబులెన్స్ ఇతర వాహనాలు మృతదేహన్ని తీసుకొచ్చేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో బైక్ పై మహిళ మృతదేహన్ని తీసుకెళ్లారు. ఈ ఘటన 2021 ఏప్రిల్ 27న చోటు చేసుకొంది.మరో వైపు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఓ వ్యక్తి తన భార్య మృతదేహన్ని సైకిల్ పై తీసుకెళ్లాడు. ఈ ఘటన 2021 ఏప్రిల్ 29న చోటు చేసుకొంది.
మరో వైపు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఓ వ్యక్తి తన భార్య మృతదేహన్ని సైకిల్ పై తీసుకెళ్లాడు. ఈ ఘటన 2021 ఏప్రిల్ 29న చోటు చేసుకొంది. కరోనాతో భార్య చనిపోవడంతో సైకిల్ పై తీసుకెళ్లాడు వ్యక్తి. ఈ డెడ్ బాడీని ఎవరూ తీసుకెళ్లేందుకు ముందుకు రాకపోవడంతో ఆ వ్యక్తి తన సైకిల్ పై భార్య డెడ్ బాడీని తీసుకెళ్లాడని మీడియా కథనాలు ప్రసారం చేసింది.