నెల్లూరు కోర్టులో చోరీని సుమోటోగా తీసుకున్న హైకోర్టు: నేడు విచారణ

Published : Apr 26, 2022, 10:04 AM IST
నెల్లూరు కోర్టులో చోరీని సుమోటోగా తీసుకున్న హైకోర్టు: నేడు విచారణ

సారాంశం

నెల్లూరు కోర్టులో చోరీ కేసు ఘటనను ఏపీ హైకోర్టు సుమోటోగా తీసుకొంది. ఈ విషయమై మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తదితరులను ప్రతివాదులుగా చేర్చింది ఉన్నత న్యాయ స్థానం.  

నెల్లూరు: నెల్లూరు కోర్టులో చోరీ కేసు ఘటనను ఏపీ హైకోర్టు సుమోటోగా తీసుకొంది. ఈ విషయమై ఉన్నత న్యాయస్థానం మంగళవారం నాడు విచారణ నిర్వహించనుంది.  ఈ కేసులో మంత్రి Kakani Govardhan Reddy, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ లను ప్రతివాదులుగా చేర్చింది కోర్టు. నెల్లూరు జిల్లా  జడ్జి హైకోర్టుకు చోరీ కేసుకు సంబంధించి కీలక నివేదికను అందించింది.

Nellore Court ఆవరణలో చోరీ కేసులో ఈ నెల 17 ఇద్దరిని police అరెస్ట్ చేశారు. సయ్యద్ హయత్ , ఖాజా రసూల్ ను అరెస్ట్ చేసినట్టుగా ఎస్పీ  విజయరావు తెలిపారు.కోర్టు ప్రాంగణంలో ఇనుము చోరీ కోసం  వచ్చిన నిందితులు కుక్కలు వెంబడించడంతో కోర్టు ఆవరణలోకి వెళ్లినట్టుగా పోలీసులు చెప్పారు.

కోర్టు  తాళం పగులగొట్టి లోపలికి వెళ్లారని SP  వివరించారు.. కోర్టు లోపల ఉన్న బీరువాలో బ్యాగును తీసుకెళ్లారన్నారు. కోర్టులో చోరీకి గురైన అన్ని వస్తువులను రికవరీ చేశామన్నారు.కోర్టులో నిందితులు తీసుకెళ్లిన బ్యాగ్ నుండి సెల్ ఫోన్, ల్యాప్ టాప్ తీసుకొని మిగిలిన వాటిని నిందితులు పారేశారని ఎస్పీ Vijaya Rao వివరించారు.

నెల్లూరు జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలోని 4వ అదనపు కోర్టులో ఈ నెల 14న చోరీ జరిగింది.ఈ  చోరీలో పలు కేసులకు సంబంధించిన కీలకమైన డాక్యుమెంట్లు చోరీకి గురయ్యాయి. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పై మాజీ మంత్రి Somi Reddy Chandra Mohan Reddy వేసిన కేసుకు సంబంధించిన ఆధారాలు చోరీకి గురయ్యాయని  ప్రచారం సాగుతుంది. ఈ కేసుతో పాటు ఇతర కేసులకు సంబంధించిన ఆధారాలు కూడా చోరీకి గురి కావడం కలకలం రేపుతుంది.

మలేషియా, సింగపూర్, హాంగ్ కాంగ్ లలో సోమిరెడ్డికి ఆస్తులు ఉన్నాయని, పెద్దమొత్తంలో లావాదేవీలు జరిపారని కాకాని గతంలో ఆరోపణలు చేశారు. అంతేకాకుండా, ఇందుకు సంబంధించిన కొన్ని పత్రాలనూ ఇటీవల విడుదల చేశారు. ఆ పత్రాలను మీడియా ముందు కూడా ఉంచారు. అయితే ఆ పత్రాలన్నీ నకిలీవని, తనపై లేనిపోని అభాండాలు వేస్తున్నారని, ఈ నకిలీ పత్రాలు సృష్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు సోమిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కాకాని గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. 

సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కాకాని గోవర్ధన్ రెడ్డి విడుదల చేసిన పత్రాలు ఫోర్జరీవిగా పోలీసులు గుర్తించారు. కాకాని గోవర్ధన్ రెడ్డి  తెచ్చిన డాక్యుమెంట్లు ఫోర్జరీవి అని తేలిందని ఫోరెన్సిక్ లేబోరేటరీ తేల్చింది. అసలు సోమిరెడ్డి మలేషియాకు వెళ్లలేదని ఇమ్మిగ్రేషన్ అధికారులు ధృవీకరించారు. ఫోర్జరీ డాక్యుమెంట్ల కేసులో కొందరిని అరెస్టు కూడా చేశారు. ఈ మేరకు పలువురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు చార్జీషీట్ ను కూడా దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించిన ఆధారాలను కోర్టులో భద్రపర్చారు.  
 

PREV
click me!

Recommended Stories

Rain Alert : తెలుగు ప్రజలారా బిఅలర్ట్.. పిడుగులు, ఈదురుగాలుల వర్షాలతో ఈ ప్రాంతాలకు పొంచివున్న ప్రమాదం
Seediri Appalaraju Arrest: అప్పలరాజు దెబ్బకు జగన్ కొంప కొల్లేరు | Asianet News Telugu