కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం.. తండ్రీకొడుకులు మృతి

Published : Jun 19, 2022, 02:16 PM IST
కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం.. తండ్రీకొడుకులు మృతి

సారాంశం

కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గండేపల్లి గ్రామ శివారులో చోటుచేసుకున్న ప్రమాదంలో తండ్రీకొడుకులు మృతిచెందారు.

కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గండేపల్లి గ్రామ శివారులో చోటుచేసుకున్న ప్రమాదంలో తండ్రీకొడుకులు మృతిచెందారు. వివరాలు.. గండేపల్లి గ్రామ శివారు వద్ద కారు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో రాగంపేటకు చెందిన కంటే విశ్వనాథం, అతని కొడుకు కంటే రాజేష్‌ అక్కడికక్కడే మృతి చెందారు. విశ్వనాథం భార్యకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన మహిళను ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

మరోవైపు తూర్పు గోదావరి జిల్లాలోని గోపాలపురం మండలంలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు.  గ్రానైట్‌ లోడుతో రాజమండ్రి వైపు వెళ్తున్న లారీ, మెటల్‌ లోడుతో వెళ్తున్న లారీ ఎదురెదురుగా ఢీ కొన్నాయి. దీంతో లారీల క్యాబిన్‌లో డ్రైవర్లు ఇరుక్కుపోయారు. జేసీబీ సహాయంతో డైవర్స్‌ని బయటకు తీశారు. అయితే ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో ఒక లారీ డ్రైవర్‌ మృతి చెందాడు. మరొక డ్రైవర్ని గోపాలపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. 
 

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్