మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి ఇంటి గోడ కూల్చివేత కక్షసాధింపులో భాగమేనని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ఆరోపించారు. తమ పార్టీకి చెందిన బీసీ నేతలను లక్ష్యంగా చేసుకొని వైసీపీ అక్రమంగా కేసులు పెడుతుందన్నారు.
అమరావతి:మాజీ మంత్రి Ayyanna Patrudu, ఇంటి గోడ కూల్చివేత కక్షసాధింపేనని TDP చీఫ్ Chandrababu విమర్శించారు.. టీడీపీలోని బీసీ నేతలను లక్ష్యంగా చేసుకొని YS Jagan అక్రమ కేసులు, అరెస్ట్ లు, దాడులకు పాల్పడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. చోడవరం Mini Mahanadu వేదికగానే వైఎస్ జగన్ సర్కార్ పై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఎండగట్టినందుకే ఆయన ఇంటి గోడ కూల్చివేసే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు. అయ్యన్నపాత్రుడు అడిగే ప్రశ్నల్లో ఒక్క దానికైనా జగన్ సమాధానం చెప్పే పరిస్థితిలో ఉన్నాడా అని చంద్రబాబు ప్రశ్నించారు.
also read:తెల్లవారుజామున ఇళ్లు కూల్చే అధికారం ఎవరిచ్చారు - మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
undefined
ఏం సమాధానం చెప్పలేకనే అయ్యన్నపాత్రుడి ఇంటి గోడ కూల్చివేతకు పూనుకొన్నారని చంద్రబాబు విమర్శలు గుప్పించారు. పంట కాలువ ఆక్రమించుకొని ఇంటిని నిర్మించారని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి ఇంటి గోడను ఆదివారం నాడు తెల్లవారుజామున పోలీసుల సహాయంతో రెవిన్యూ అధికారులు కూల్చి వేశారు. పంట కాలువలో రెండు సెంట్ల భూమిని ఆక్రమించారని అయ్యన్నపాత్రుడి ఇంటి గోడ కూల్చివేశారు.
పంట కాలువను ఆక్రమించి మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇంటిని నిర్మించారని ఆరోపిస్తూ ఆదివారం నాడు తెల్లవారుజామున రెవిన్యూ పోలీస్ అధికారులు అయ్యన్నపాత్రుడు ఇంటి గోడను కూల్చివేశారు. ఇవాళ తెల్లవారుజామున మూడు గంటలకు ఐపీఎస్ అధికారి, ఆర్డీఓ సహా భారీ పోలీస్ బందోబస్తుతో వచ్చి అయ్యన్నపాత్రుడి ఇంటి వెనుక భాగంలో నిర్మించిన గోడను కూల్చివేశారు. పంట కాలువలో సుమారు 3సెంట్ల భూమిని ఆక్రమించుకొని అయ్యన్నపాత్రుడు ఇంటిని నిర్మించారని ఆర్డీఓ గోవిందరాజులు మీడియాకు చెప్పారు.
తాము నిర్వహించిన సర్వేలో ఈ విషయం తేటతెల్లమైందన్నారు. ఆక్రమించిన స్థలాన్ని స్వాధీనం చేసుకొంటాని ఆర్డీఓ చెప్పారు. గతంలో ఇదే విషయమై అయ్యన్నపాత్రుడికి నోటీసులు ఇస్తే తీసుకోలేదన్నారు. దీంతో గోడకు నోటీసులు అంటించి వెళ్లారన్నారు. మరో వైపు ఇవాళ ఉదయం కూడా నోటీసులు లు ఇచ్చి గోడను కూల్చివేశామని ఆర్డీఓ గోవిందరాజులు మీడియాకు చెప్పారు.
ఇదిలా ఉంటే తాము అన్నీ అనుమతులు తీసుకున్న తర్వాతే ఇంటి నిర్మాణాన్ని చేపట్టామని అయ్యన్నపాత్రుడి రెండో కొడుకు రాజేష్ చెప్పారు. మున్సిపల్ కమిషనర్ తో పాటు ఇరిగేషన్ అధికారులు కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు ఇచ్చారని రాజేష్ మీడియాకు వివరించారు. తమకు ముందస్తుగా ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని కూడా అయ్యన్నపాత్రుడి కుటుంబ సభ్యులు మీడియాకు చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై మాజీ మంత్రి అయ్యన్నపాాత్రుడు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాతో పాటు పలు వేదికలపై విమర్శలు చేస్తున్నారు. దీంతో అయ్యన్నపాత్రుడిని లక్ష్యంగా చేసుకొని జగన్ సర్కార్ అక్రమాలకు పాల్పడుతుందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే అయ్యన్నపాత్రుడిపై 12 కేసులు నమోదు చేసిన విషయాన్ని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. మరో వైపు అయ్యన్నపాత్రుడి ఇంటి గోడ కూల్చి వేత విషయాన్ని తెలుసుకొన్న ఆ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అయ్యన్నపాత్రుడి ఇంటి వద్దకు చేరుకున్నారు. వైసీపీకి, సీఎం జగన్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జగన్ సర్కార్ కక్షపూరితంగా వ్యవహరిస్తుందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఇదిలా ఉంటే టీడీపీ కార్యకర్తలు, నేతలు గోడ కూల్చి వేయకుండా అడ్డుకుంటున్నారని ఆర్డీఓ గోవిందరాజులు మీడియాకు చెప్పారు. టీడీపీ క్యాడర్ జేసీబీ డ్రైవర్లను బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు. పంట కాలువను ఆక్రమించుకున్న ప్రాంతాన్ని తొలగిస్తామని ఆర్డీఓ స్పష్టం చేశారు.