పల్నాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటో, లారీ ఢీ.. 5 గురు మృతి..

Published : May 17, 2023, 07:32 AM IST
 పల్నాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటో, లారీ ఢీ.. 5 గురు మృతి..

సారాంశం

పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు చనిపోయారు. మరో 10 మందికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఆటోను, లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

ఓ ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 5 గురు మరణించారు. మరో 10 మందికి గాయాలు అయ్యాయి. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది. క్షతగాత్రులు ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం కోసం హాస్పిటల్ కు తరలించారు.

కరీంనగర్ లో విషాదం.. నెలల క్రితం కోడలు, మూడు రోజుల కిందట కుమారుడు ఆత్మహత్య.. తట్టుకోలేక తల్లి మృతి..

వివరాలు ఇలా ఉన్నాయి. పల్నాడు జిల్లాలోని దాచేపల్లి ప్రాంతంలో నల్గొండ జిల్లా దామరచర్ల మండలం నర్సాపురం గ్రామానికి చెందిన 23 మంది కూలీలు ఆటోలోప్రయాణిస్తున్నారు. వీరంతా గురజాల మండలం పులిపాడుకు వెళ్తున్నారు. అయితే ఈ సమయంలో ఒక్క సారిగా లారీ వచ్చి ఆటోను ఢీకొట్టింది. దీంతో అందులో ఉన్న కూలీలందరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు.

డిజిటల్ కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికేట్ ఏ దేశమూ ఇవ్వలేదు.. సుందర్ పిచాయ్ కూడా మెచ్చుకున్నారు - అనురాగ్ ఠాకూర్

మరో 10 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందడంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు  చేస్తున్నారు. 

ఇలాంటి ఘటనే తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి  మండలం యర్నగూడం వద్ద  మంగళవారం జరిగింది. ఇక్కడ కారు, మెడికల్ వ్యాన్,  కంటైనర్  ఢీకొనడంతో  ముగ్గురు మృతి చెందారు. ఘటనా స్థలంలోనే  ఇద్దరు మరణించారు. చికిత్స కోసం హాస్పిటల్ కు తరలిస్తున్న సమయంలో మరొకరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో వ్యక్తి కూడా గాయపడ్డారు. ఆయనను సమీపంలోని హాస్పిటల్ చేర్పించారు. ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నాడు.

3 నెలల్లోగా లావు తగ్గండి.. అయినా ఫిట్ గా మారకపోతే వీఆర్ఎస్ తీసుకోండి - పోలీసులకు డీజీపీ వార్నింగ్

కొవ్వూరు నుండి ఏలూరు వైపు వెళ్తున్న కారు  అతి వేగంగా  నడపడం వల్ల  ప్రమాదానికి కారణమైందని పోలీసులు చెబుతున్నారు. వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టి  పక్క రోడ్డులో వెళ్తున్న  మెడికల్ వ్యాన్, కంటైనర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదం పై  పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్