
నంద్యాలలో ఏవీ సుబ్బారెడ్డిపై టీడీపీ నేత, మాజీ మంత్రి అఖిలప్రియ వర్గీయులు దాడికి దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని సుబ్బారెడ్డిని కారులో ఎక్కించి పంపారు. వివరాల్లోకి వెళితే.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రస్తుతం నంద్యాల నియోజకవర్గంలో సాగుతోంది. ఈ యాత్రలో ఏవీ సుబ్బారెడ్డి, భూమా అఖిలప్రియ పాల్గొన్నారు. ఈ క్రమంలోనే సుబ్బారెడ్డిపై అఖిలప్రియ వర్గీయులు దాడికి దిగారు. లోకేష్ సమక్షంలోనే ఈ ఘటన జరగడంతో ఆయన కూడా అసహనం వ్యక్తం చేసినట్లుగా సమాచారం. గొడవ మరి పెద్దది కాకుండా పోలీసులు సుబ్బారెడ్డిని పక్కకు తీసుకెళ్లారు. మరోవైపు ఈ ఘటన నేపథ్యంలో నంద్యాల పోలీసులు అప్రమత్తమయ్యారు. పట్టణంలోని కీలక ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు.