ప‌డిపోతున్న కూట‌మి గ్రాఫ్‌.. జగనన్న వన్స్ మోర్ అంటున్న జనాలు.. వైకాపా

By Mahesh Rajamoni  |  First Published May 11, 2024, 4:36 PM IST

Andhra Pradesh Elections 2024 : మళ్లీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో జగన్ ప్రభంజనం ఖాయమ‌నీ, వెలువ‌డుతున్న‌ సర్వేలన్నీవైఎస్ఆర్సీపీ వైపు చూపిస్తున్నాయ‌ని వైకాపా శ్రేణులు పేర్కొంటున్నాయి. ఇదే సమయంలో అమలు సాధ్యంకాని విధంగా టీడీపీ కూటమి మేనిఫెస్టో ఉంద‌నీ, దీంతో క్ర‌మంగా వారి గ్రాఫ్ త‌గ్గుతున్న‌ద‌ని రాజీకీయ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది. 
 


YS Jagan Mohan Reddy vs Chandrababu Naidu : ఎన్నిక‌ల క్ర‌మంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాలు ప‌తాక‌స్థాయికి చేరుకున్నాయి. ఎన్నిక‌ల ప్ర‌చార హోరుతో ఏపీ రాజ‌కీయాలు హీటెక్కాయి. త‌మ‌దే గెలుపు అంటే కాదు మాదే గెలుపు అంటూ రాష్ట్రంలోని రాజ‌కీయ పార్టీలు ప్ర‌క‌టించుకుంటున్నాయి. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ, టీడీపీ కూట‌మి మ‌ధ్య ప్ర‌ధాన పోరు క‌నిపిస్తోంది. అయితే, రాష్ట్రంలో మ‌రోసారి జ‌గ‌న‌న్న ప్ర‌భంజ‌నం ఉంటుంద‌నీ, మ‌ళ్లీ సీఎం కూర్చిలో వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కూర్చుంటార‌ని వైఎస్ఆర్సీపీ శ్రేణులు పేర్కొంట‌న్నాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో మ‌ళ్లీ 2019 ఎన్నికల ఫలితాలు రిపీట్ కాబోతున్నాయ‌నీ, గ‌త‌ ఐదేండ్లలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి విషయంలో జగన్ చేపట్టిన సంస్కరణలు ఆయన్ను తిరుగులేని నాయకుడిగా మరోసారి నిలుపుతున్నాయ‌ని వైకాపా నాయ‌కులు, శ్రేణులు పేర్కొంటున్నారు.

దీనికి వెలువ‌డుతున్న ఎన్నిక‌ల సర్వే అంచనాలే నిద‌ర్శ‌న‌మ‌ని చెబుతున్నారు. ప్ర‌స్తుతం ఎన్నికల సందర్భంగా వివిధ సర్వే సంస్థలు విడుదల చేస్తున్న అంచనాలన్నింటిలోనూ జ‌గ‌న్ నాయ‌క‌త్వంలోని వైఎస్ఆర్సీపీదే గెలుప‌ని తేల్చి చెబుతున్నాయి. ఒక‌టి కాదు.. రెండు కాదు ఏకంగా 10కి పైగా సర్వే సంస్థల అంచనాల్లోనూ మళ్ళీ ఫ్యాన్ గుర్తు ప్రభంజనం సృష్టిస్తుందని చెబుతున్నాయ‌ని వైకాపా శ్రేణులు చెబుతున్నాయి. ప్ర‌స్తుత ఏపీ ప‌రిస్థితులు గ‌మ‌నిస్తే 2019లో రాయలసీమలో సాధించిన సీట్లను రిపీట్ చేయడం ఖాయమనీ, కోస్తాలోనూ వైసీపీ పట్టు నిలుపుకుంటుందని విశ్లేషకుల అంచనా వేసిన విష‌యాల‌ను గుర్తుచేస్తున్నారు. వైకాపా దాదాపు 120 - 130 అసెంబ్లీ సీట్లు, 20 - 21 ఎంపీ సీట్లు సాధిస్తుందని సర్వే సంస్థలతోపాటు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. టైమ్స్ నౌ, చాణ్యక్య గ్రూప్ ఆత్మసాక్షి, జన్మత్ పోల్స్, పోల్ స్ట్రాజటీ గ్రూప్, పొలిటికల్ క్రిటిక్ లాంటి సంస్థలన్నీ జగన్‌దే విజయం అని తేల్చి చెప్పాయ‌ని వైకాపా నాయ‌కులు గుర్తుచేస్తున్నారు.

Latest Videos

undefined

నిజానికి గత మూడు నెలలుగా సీఎం వైయస్ జగన్ సిద్ధం సభలు, మేమంతా సిద్ధం యాత్ర, ఇప్పుడు నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి భారీ మద్దతు లభిస్తోంద‌నీ, ఈ ప‌రిస్థితులు రాబోయే త‌మ అనుకూల ఫ‌లితాల‌ను చూపిస్తున్నాయ‌ని వైఎస్ఆర్సీపీ శ్రేణులు పేర్కొంటున్నాయి. నియోజకవర్గాల్లో క్యాడర్ బలంగా ఉండడంతోబాటు సీఎం వైయస్ జగన్ అమలు చేసిన పథకాల ద్వారా లబ్ధి పొందిన ప్రజల నుంచి కూడా మద్దతు అంతే స్థాయిలో వస్తోంది. ముఖ్యంగా మహిళలు, పింఛన్ లబ్ధిదారుల నుంచి  జగన్‌కు భారీ మద్దతు లభిస్తోందంటున్నారు.

జ‌గ‌న్ కు బ‌ల‌మైన మ‌ద్ద‌తు ల‌భిస్తుండ‌గా, చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ల‌తో కూడిన‌ కూట‌మికి ప్ర‌జ‌ల నుంచి షాక్ త‌ప్ప‌ద‌ని వైకాపా నాయ‌కులు పేర్కొంటున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఆది నుంచే సయోధ్య కుదరడం లేదనీ, అభ్యర్థుల ఎంపిక దగ్గర్నుంచి.. సీట్ల పంపకాలు, మేనిఫెస్టో ప్రకటన వరకు అంతా అయోమయం, గందరగోళం ఉంద‌నీ, దీంతో జనం వారిని నమ్మడం లేదని చెబుతున్నారు. దీనికి తోడు కూటమి మేనిఫెస్టోను చూసిన ప్రజలు ఇది ఆమలు సాధ్యమేనా అని ప్రశ్నిస్తున్నారు. ఇదే స‌మ‌యంలో సీఎం వైయస్ జగన్ అమలు సాధ్యమైయ్యే హామీలే ఇచ్చానంటూ ధీమాగా ఎన్నికలకు వెళ్లడం కూడా కలిసి వస్తోందని వైకాపా శ్రేణులు పేర్కొంటున్నాయి. వాలంటీర్లను దూరం పెట్టడం, పెన్షన్లు ఇంటి దగ్గర అందకుండా కుట్ర చేయడంలాంటి చర్యలు టీడీపీ కూటమిపై ప్రజలకు మరింత ఆగ్రహానికి గురిచేశాయనీ, మొత్తం మీద ఈసారి కూడా వైఎస్ఆర్సీపీదే విజయమన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా వేసిన విష‌యాల‌ను వైకాపా నాయ‌కులు గుర్తుచేస్తున్నారు.

click me!