ఇంటికెళ్లి మరీ వైసిపి అభ్యర్థికి అల్లు అర్జున్ ప్రచారం...ఎవరీ శిల్పా రవి? బన్నీతో బంధమేంటి?

Published : May 11, 2024, 03:20 PM ISTUpdated : May 11, 2024, 03:29 PM IST
ఇంటికెళ్లి మరీ వైసిపి అభ్యర్థికి అల్లు అర్జున్ ప్రచారం...ఎవరీ శిల్పా రవి? బన్నీతో బంధమేంటి?

సారాంశం

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ తెలుగు సినీతారలు పవన్ కల్యాణ్ కు మద్దతు ప్రకటించారు. అలాంటిది మెగా ఫ్యామిలీ హీరోల్లో ఒకరైన అల్లు అర్జున్ వైసిపి అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేసారు.  

కర్నూల్ : ఆంధ్ర ప్రదేశ్ లో ఎలక్షన్ హీట్ ఫీక్స్ కు చేరుకుంది. ఇవాళ్టితో(శనివారం) ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. దీంతో ఈరోజు సాధ్యమైనంత ఎక్కువగా ప్రచారం చేసేందుకు ప్రదాన పార్టీల నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అనూహ్యంగా వైసిపి అభ్యర్థికి  మద్దతుగా నిలిచారు. మెగాస్టార్ కుటుంబంతో పాటు తెలుగు సినీతారలంతా పవన్ కల్యాణ్ జనసేనకు, ప్రతిపక్ష కూటమికి మద్దతుగా ప్రచారం చేస్తుంటే అల్లు అర్జున్ మాత్రం వైసిపి నాయకుడి ఇంటికి వెళ్లిమరీ ప్రచారం చేసారు. 

నంద్యాలలో పవన్ కల్యాణ్ సందడి : 

అల్లు అర్జున్ సతీసమేతంగా నంద్యాలలో సందడి చేసారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా రవిచంద్రరెడ్డి ఇంటికి అల్లు అర్జున్, స్నేహారెడ్డి వెళ్లారు. అల్లు దంపతులకు శిల్పా కుటుంబసభ్యులతో పాటు భారీగా చేరుకున్న ఫ్యాన్స్, వైసిపి నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. గజమాలతో బన్నీ దంపతులకు సత్కరించారు.  

 అల్లు అర్జున్ నంద్యాలకు వస్తున్నట్లు ముందుగానే తెలియడంతో ఉదయం నుండే పట్టణంలో సందడి నెలకొంది. అల్లు దంపతులు నంద్యాలలోకి ఎంటర్ కాగానే అభిమానులంతా ఆయన వాహనాన్ని చుట్టుముట్టారు. వారి కోరిక మేరకు బన్నీ కారు సన్ రూఫ్ నుండి బయటకు వచ్చి అభివాదం చేసారు. ఇలా ఫ్యాన్స్ కోలాహలం మధ్య శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి చేరుకున్నారు. 

శిల్పా రవిచంద్రారెడ్డి కుటుంబసభ్యులు అల్లు అర్జున్  దంపతులను సాదరంగా ఇంట్లోకి తీసుకెళ్లారు. ఇంటిబయట వేలాదిగా ఎదురుచూస్తున్న అభిమానులకు అల్లు అర్జున్ దంపతులు అభివాదం చేసారు. ఇంటి పైనుండే శిల్పా రవిచంద్రారెడ్డి చెయ్యి పైకెత్తి ఎన్నికల్లో ఓటేసి గెలిపించాలని బన్నీ కోరారు. 

ఎవరీ శిల్పా రవి.. బన్నీకి అంత క్లోజ్ ఎలా? 

మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి తనయుడే ఈ శిల్పా రవిచంద్రారెడ్డి. బిఎస్సి అగ్రికల్చర్ చదివిన ఆయన తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో నంద్యాల అసెంబ్లీకి పోటీచేసి గెలిచి గత ఐదేళ్ళుగా ఎమ్మెల్యేగా కొనసాగారు. వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి మరోసారి శిల్పాపైనే నమ్మకం వుంచి టికెట్ కేటాయించారు... దీంతో ఆయన ముమ్మరంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రచారం చివరిరోజు అందరినీ ఆశ్చర్యపరుస్తూ అల్లు అర్జున్ ను రంగంలోకి దింపారు శిల్పా రవించంద్రారెడ్డి.  

అయితే తెలుగు సినీతారలంతా పవన్ కల్యాణ్ కు మద్దతుగా నిలుస్తూ వైసిపికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తుంటే అల్లు అర్జున్ మాత్రం వైసిపి అభ్యర్థికి మద్దతివ్వడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే తన భార్య స్నేహారెడ్డి కోరిక మేరకే బన్నీ శిల్పా రవికి ప్రచారం చేసినట్లు తెలుస్తోంది. శిల్పా రవించంద్రారెడ్డి భార్య నాగిని రెడ్డి, అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి చిన్ననాటి స్నేహితులు. పెళ్లి తర్వాత కూడా వారి స్నేహం అలాగే కొనసాగుతోంది... అంతేకాదు వారి భర్తలు కూడా స్నేహితులయిపోయ్యారు. ఇలా ఇరు ఫ్యామిలీస్ మధ్య స్నేహమే అల్లు అర్జున్ ను నంద్యాల వరకు రప్పించింది... వైసిపి అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేయించింది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు