ఉక్రెయిన్- రష్యాల మధ్య యుద్ధ వాతావరణం : బిక్కుబిక్కుమంటోన్న ఏపీ వాసులు.. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రికి జగన్ లేఖ

Siva Kodati |  
Published : Feb 23, 2022, 09:27 PM ISTUpdated : Feb 24, 2022, 09:45 AM IST
ఉక్రెయిన్- రష్యాల మధ్య యుద్ధ వాతావరణం : బిక్కుబిక్కుమంటోన్న ఏపీ వాసులు.. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రికి జగన్ లేఖ

సారాంశం

కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్‌కు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం లేఖ రాశారు. ఉక్రెయిన్‌లో ఉన్న ఏపీ వాసులను సురక్షితంగా తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. వాళ్లని వెనక్కి తీసుకురావడంలో కావాల్సిన సహకారం కోసం ఢిల్లీలోని ఏపీ భవన్‌, ఇక్కడి సీఎంవో అందుబాటులో ఉంటుందని ముఖ్యమంత్రి లేఖలో చెప్పారు

కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్‌కు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (ys jagan mohan reddy) బుధవారం లేఖ రాశారు. ఉక్రెయిన్‌లో ఉన్న ఏపీ వాసులను సురక్షితంగా తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అక్కడ చిక్కుకున్న ఏపీ వాసులు.. తిరిగి రాష్ట్రానికి రావడానికి సహాయం కోరుతున్నారని.. రాష్ట్ర ప్రభుత్వం నిత్యం కేంద్ర విదేశాంగ శాఖతో టచ్‌లో ఉందని జగన్ పేర్కొన్నారు. వాళ్లని వెనక్కి తీసుకురావడంలో కావాల్సిన సహకారం కోసం ఢిల్లీలోని ఏపీ భవన్‌, ఇక్కడి సీఎంవో అందుబాటులో ఉంటుందని ముఖ్యమంత్రి లేఖలో చెప్పారు. ఉక్రెయిన్‌లోని ఏపీ విద్యార్థులతో ప్రభుత్వం టచ్‌లో ఉందని.. కేంద్రం సూచించిన మేరకు వారంతా వెనక్కి రావడానికి మా వంతు సహకారం అందిస్తున్నామని సీఎం వైఎస్‌ జగన్‌ లేఖలో పేర్కొన్నారు.

మరోవైపు .. ఉక్రెయిన్, ర‌ష్యా పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య ఉక్రెయిన్ సరిహద్దు నుంచి భారతీయులను తిరిగి తీసుకురావడానికి ఎయిర్ ఇండియా (air india) మంగళవారం బోయింగ్ (boeing)-787 విమానాన్ని నడిపింది. ఈ విమానంలో 250 మందికి పైగా ప్రయాణీకుల సిట్టింగ్ కెపాసిటీ ఉంది. ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్‌సైట్ (flight tracking website) ప్రకారం.. AI-1947 IST ఉదయం 7.30 గంటలకు న్యూఢిల్లీ (new delhi) నుంచి బయలుదేరి మధ్యాహ్నం 3 గంటలకు ఉక్రెయిన్‌లోని కైవ్‌ (Kyiv)లోని విమానాశ్రయానికి చేరుకుంది. అక్క‌డి నుంచి బ‌య‌లుదేరి సాయంత్రం ఇక్కడికి వ‌చ్చింది. కైవ్‌లోని భారత రాయబార కార్యాలయం మంగళవారం మరోసారి భారతీయ విద్యార్థులను తాత్కాలికంగా భారతదేశానికి తిరిగి రావాలని సూచించింది. 

ఫిబ్రవరి 22, 24, 26 తేదీల్లో ఇండియా నుంచి ఉక్రెయిన్ మధ్య మూడు విమానాలు నడపనున్నట్లు ఎయిరిండియా ఫిబ్రవరి 19వ తేదీన ప్రకటించింది. ఇదిలా ఉండగా.. విమానయాన సంస్థ విస్తారా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) వినోద్ కణ్ణన్ (vinod kannan)_మాట్లాడుతూ.. త‌మ విమ‌నాలను ఉక్రెయిన్ కు పంపించే ప్ర‌ణాళిక ఏమీ లేద‌ని తెలిపారు. ‘‘ విమాన పరిమితులు, ఇతర కారణాల వల్ల మేము ఉక్రెయిన్‌కు ప్రస్తుతం విమానాలను ప్లాన్ చేయడం లేదు ’’ అని ఆయ‌న ఓ మీడియా సంస్థ‌తో ప్ర‌త్యేకంగా తెలిపారు. 

రష్యా తీసుకుంటున్న దూకుడు చ‌ర్య‌లను అమెరికా (america), బ్రిటన్ (Britain) సహా పలు దేశాలు విమర్శిస్తున్నాయి. రెండు రోజుల కింద‌ట ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశంలో భారతదేశ శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి (ts tirumurthi) మాట్లాడారు. భారతీయ పౌరులను వెనక్కి తీసుకోవడమే త‌మ ప్రభుత్వ ప్రాధాన్యత అని  చెప్పారు. ‘‘ మాకు మా పౌరుల భద్రత చాలా ముఖ్యం. 20,000 మందికి పైగా భారతీయ విద్యార్థులు, జాతీయులు ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతాలతో సహా వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. భారతీయుల శ్రేయస్సు మాకు అత్యంత ప్రాధాన్యం ’’ అని ఆయ‌న చెప్పారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu
YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu