
అమరావతి : టీడీపీ-జనసేన పొత్తుతో ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగుతున్నారు. ఈ మేరకు శనివారం నాడు ఉమ్మడిగా అభ్యర్థుల జాబితాలను కూడా ప్రకటించారు. టీడీపీ 94 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించగా, జనసేన 24 అసెంబ్లీ స్థానాలకు పరిమితమయ్యింది. దీనిమీద జనసేన మద్దతు దారులనుంచి కూడా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ క్రమంలో దీని మీద అనేక మీమ్స్ వచ్చాయి.
మీది వెయ్యి అయ్యింది. రెండు లివర్లు ఎక్స్ ట్రా...అంటూ వైరల్ అయిన కుమారి ఆంటీ..డైలాగ్ తో పవన్ ను మీమర్స్ ఆడుకుంటున్నారు.
ఇక మరొకరైతే గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ చాటింగ్ తో పోల్చుతూ.. ఫన్నీ గా మరో మీమ్ చేశారు. అలాంటి కొన్ని మీమ్స్ మీరూ చూడండి.