రెండు నెలల్లోనే 24వేల కేసులు,32వేల అరెస్టులు...ఇది మా నిబద్దత: మంత్రి నారాయణస్వామి

By Arun Kumar PFirst Published Jul 20, 2020, 7:03 PM IST
Highlights

ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం కోసమే రాష్ట్రంలో మద్యం వినియోగాన్ని తగ్గించడం జరుగుతోందని ఏపి ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి స్పష్టం చేశారు. 

అమరావతి: ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం కోసమే రాష్ట్రంలో మద్యం వినియోగాన్ని తగ్గించడం జరుగుతోందని ఏపి ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి స్పష్టం చేశారు.  ప్రజారోగ్యమే  ప్రధాన లక్ష్యంగా ఇప్పటికే దశలవారి మద్యపాన నియంత్రించడం కోసం వైసిపి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందన్నారు. ఈ చర్యల వల్ల రాష్ట్రంలో మద్యం అమ్మకాలు భారీగా తగ్గాయని మంత్రి వెల్లడించారు. 

''మద్యపాన వినియోగం తగ్గడం వల్ల రోడ్డు ప్రమాదాలు కూడా తగ్గాయి. అక్రమ మద్యం తయారీదారులపై గట్టి నిఘా పెట్టి వారిపై నిరంతరం దాడులు నిర్వహిస్తున్నాం. పక్క రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం రవాణాను అరికట్టేందుకు కూడా గట్టి చర్యలు తీసుకుంటున్నాం. చెక్ పోస్టుల వద్ద నిఘాను బలోపేతం చేస్తున్నాం'' అని అన్నారు. 

''అక్రమ మద్యాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తాం. ఇతర రాష్ట్రాల నుండి వస్తున్న మద్యాన్ని భారీగా స్వాధీనం  చేసుకుంటున్నాం.  అక్రమాల వెనుక ఎంతటి వారున్న వదిలే ప్రసక్తి లేదు. పిడి యాక్ట్ కేసులు కూడా పెడతాం. నూతనంగా సవరించిన చట్టాల ప్రకారం కఠినం గా శిక్షలను అమలు చేస్తాం'' అని హెచ్చరించారు. 

read more   40 నిమిషాలు భేటీ: గవర్నర్ చేతిలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ భవిష్యత్తు

''గత 8 సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించిన ప్రభుత్వాలు మహిళలకు ఏమి చేయలేవని...ఇప్పుడు  జగనన్న మహిళలకు ఇచ్చిన కానుక మద్య నియంత్రనను చిత్తశుద్దితో అమలు చేస్తుంటే అడ్డుపడుతున్నారు.  జగనన్నకు ఉన్న ప్రజా మద్దతును చూసి ఓర్వలేక అసూయతో యఎల్లో మీడియాలో తప్పుడు వార్తలు రాయిస్తున్నారు. జగనన్నఆశయాలను నీరు గార్చే చర్యలను సహించే ప్రసక్తే లేదు'' అని అన్నారు. 

''స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏర్పడిన తర్వాత 16-5-2020 నుండి 19-07-2020 వరకు రాష్ట్రవ్యాప్తంగా 24,414 కేసులు నమోదు చేయడం జరిగింది.  32,390 మందిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. సుమారు 1,28,678 లీటర్ల ఐడీని సీజ్ చేయడం జరిగింది. సుమారు 23 లక్షల 96 వేల లీటర్ల ఎఫ్.జె. వాష్ ను ధ్వంసం చేయడం జరిగింది. సుమారు లక్ష   కిలోల బ్లాక్ జాగెరీని సీజ్ చేయడం జరిగింది'' అని వెల్లడించారు. 

''16,119 లీటర్ల ఐఎమ్ఎల్, 1235 లీటర్ల బీర్, 1,16,866లీటర్ల ఎన్డీపీఎల్ సీజ్ చేయడం జరిగింది.  సుమారు 24,518 కిలోల గంజాయిను సీజ్ చేయడం జరిగింది.  8,691 వాహనాలను సీజ్ చేయడం జరిగింది'' అని మంత్రి నారాయణ స్వామి వెల్లడించారు. 

     

click me!