కరోనా ఎఫెక్ట్: ఆగష్టు 5 వరకు తిరుపతిలో కఠిన ఆంక్షలు

Published : Jul 20, 2020, 05:43 PM ISTUpdated : Jul 20, 2020, 05:53 PM IST
కరోనా ఎఫెక్ట్: ఆగష్టు 5 వరకు తిరుపతిలో కఠిన ఆంక్షలు

సారాంశం

అధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో కరోనాను కట్టడి చేసేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఆగష్టు 5వ తేదీ వరకు తిరుపతిలో కఠినమైన ఆంక్షలు అమలు చేస్తున్నట్టుగా జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా ప్రకటించారు.


తిరుపతి:అధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో కరోనాను కట్టడి చేసేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఆగష్టు 5వ తేదీ వరకు తిరుపతిలో కఠినమైన ఆంక్షలు అమలు చేస్తున్నట్టుగా జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా ప్రకటించారు.

also read:తిరుమలలో కరోనా కలకలం: శ్రీనివాస మంగాపురం ఆలయం మూసివేత

సోమవారం నాడు చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా మీడియాతో మాట్లాడారు. ప్రతి రోజూ ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకే షాపులకు అనుమతి ఇచ్చారు. ఉదయం 11 గంటల తర్వాత దుకాణాలను తెరవవద్దని కలెక్టర్ ఆదేశించారు. మద్యం దుకాణాలకు కూడ ఉదయం 11 గంటల వరకే అనుమతి ఇచ్చారు. ప్రజలు ఎవరూ కూడ అనవసరంగా రోడ్లపైకి రాకూడదని ఆయన కోరారు.

తిరుపతిలో 48 డివిజన్లను కంటెన్మెంట్ జోన్లుగా ఆయన ప్రకటించారు. కరోనాతో జిల్లాలో 56 మంది మరణించినట్టుగా ఆయన తెలిపారు. మరో వైపు 72 మంది పోలీసులకు కరోనా సోకిందని ఆయన వివరించారు. కరోనాను కట్టడి చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకొంటున్నట్టుగా ఆయన చెప్పారు. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
 

PREV
click me!

Recommended Stories

Nimmala Ramanaidu: ఈ రిజర్వాయర్ల భూ సేకరణలో జగన్ రైతులకు ఏం చేశారో తెలుసా? | Asianet News Telugu
టీడీపీ బతుకంతా కాపీ పేస్టే.. Gudivada Amarnath Comments on Bhogapuram Airport | Asianet News Telugu