ఆదాయం కోసం ప్రభుత్వం అతితెలివి

First Published Jul 4, 2017, 8:05 AM IST
Highlights

సుప్రింకోర్టు మార్గదర్శరరాలకు తూట్లు పొడిచేందుకు సిద్ధపడింది. సుప్రింకోర్టు చెప్పింది జాతీయ, రాష్ట్ర రహదారులకు 500 మీటర్లలోపు బార్లు, షాపులుండకూడదని. అందుకే రాష్ట్ర రహదారులన్నింటినీ జల్లా రహదారులుగా మార్చేయాలని అనుకున్నది. అనుకున్నదే తడవుగా సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం కూడా అయిపోయింది.

ప్రభుత్వం అతితెలివిని బాగానే చూపిస్తోంది. మద్యం ఆదాయాన్ని వదులుకోవటాన్ని ఇష్టపడని ప్రభుత్వం అందుకోసం అడ్డదారులను తొక్కుతోంది. జాతీయ, రాష్ట్ర రహదారులపై జరుగుతున్న ప్రమాదాలను అరికట్టేందుకు జాతీయ, రాష్ట్ర రహదారులకు కనీసం 500 మీటర్ల దూరంలోనే బార్లు, వైన్ షాపులను ఉంచాలని సుప్రింకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దానికి అనుగుణంగానే వందలాది బార్లను, వైన్ షాపులను వెనక్కు జరపాల్సి వచ్చింది. సుప్రింకోర్టు ఆదేశాలను కూడా ఖచ్చితంగా అమలు చేయాల్సి రావటంతో ప్రభుత్వానికి ఇబ్బందులు మొదలయ్యాయి.

మద్యం వ్యాపారులకు మద్దతుగా ప్రభుత్వం కూడా మద్యం పాలసీని సవరించింది. ఇందులో భాగంగానే వ్యాపారం గిట్టుబాటు కావటం లేదని మద్యం వ్యాపారస్తులు తమ బార్లను, షాపులను జనావాసాల్లోకి మార్చేసారు. ఎప్పుడైతే బార్లు, షాపులు జనావాసాల్లోకి వచ్చేసాయో జనాల్లో గోల మొదలైంది. అందుకనే బార్లకు, షాపులకు వ్యతిరేకంగా మూడు రోజులుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మహిళల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి.

దాంతో ప్రభుత్వానికి ఏం చేయాలో అర్ధం కాలేదు. ఎందుకంటే, రాష్ట్రంలోని జరుగుతున్న మద్యం వ్యాపారంలో మెజారిటీ వ్యాపారం అధికార పార్టీ నేతల చేతుల్లోనే ఉంది. వ్యాపారం కావటం లేదని ఒకవైపు మద్యం వ్యాపారుల ఒత్తిడి, ఇంకోవైపు మద్యం షాపులను జనావాసాల మధ్య నుండి తరలించాలంటూ మహిళా సంఘాలు ఆందోళన దాంతో ప్రభుత్వ పెద్దలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

ఈ నేపధ్యంలోనే ప్రభుత్వంలోని అతి తెలివి బయటపడింది. సుప్రింకోర్టు మార్గదర్శరరాలకు తూట్లు పొడిచేందుకు సిద్ధపడింది. సుప్రింకోర్టు చెప్పింది జాతీయ, రాష్ట్ర రహదారులకు 500 మీటర్లలోపు బార్లు, షాపులుండకూడదని. అందుకే రాష్ట్ర రహదారులన్నింటినీ జల్లా రహదారులుగా మార్చేయాలని అనుకున్నది. అనుకున్నదే తడవుగా సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం కూడా అయిపోయింది. అంటే ఇప్పటి వరకూ రాష్ట్ర రహదారులుగా ఉన్న రహదారులన్నీ ఇకపై జిల్లా రహదారులు మాత్రమే. ప్రభుత్వానికి ఎంతటి తెలివో కదా?

 

click me!