నోటి దూరుసుతో వైసీపీకి నష్టమే

Published : Aug 08, 2017, 08:53 AM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
నోటి దూరుసుతో వైసీపీకి నష్టమే

సారాంశం

ఏ విషయంలోనైనా రోజా వాగ్థాటిని అందరూ మెచ్చుకోవాల్సిందే. ఆమెను తట్టుకోలేకే అసెంబ్లీ నుండి టిడిపి ఏడాదిపాటు సస్పెండ్ చేసిందన్న విషయం అందరికీ తెలిసిందే. అంతటి వాగ్ధాటి గల రోజా ఒక్కోసారి పరిధిదాటి మాట్లాడుతోంది. దాంతో పార్టీకి చేటు తెస్తున్న విషయాన్ని కూడా గమనిస్తున్నట్లు లేరు. అంటే రోజా మాటల వల్ల లాభాన్ని పక్కన బెడితే నష్టం ఎక్కువన్న విషయం చాలా సార్లు స్పష్టమైంది.

వైసీపీ ఎంఎల్ఏ ఆర్ కె రోజా నోటి దురుసుతో పార్టీకి చేటు తెస్తున్నారు.  ఏ విషయంలోనైనా రోజా వాగ్థాటిని అందరూ మెచ్చుకోవాల్సిందే. ఆమెను తట్టుకోలేకే అసెంబ్లీ నుండి టిడిపి ఏడాదిపాటు సస్పెండ్ చేసిందన్న విషయం అందరికీ తెలిసిందే. అంతటి వాగ్ధాటి గల రోజా ఒక్కోసారి పరిధిదాటి మాట్లాడుతోంది. దాంతో పార్టీకి చేటు తెస్తున్న విషయాన్ని కూడా గమనిస్తున్నట్లు లేరు. అంటే రోజా మాటల వల్ల లాభాన్ని పక్కన బెడితే నష్టం ఎక్కువన్న విషయం చాలా సార్లు స్పష్టమైంది. ప్రత్యర్ధులపై విరుచుకుపడేటప్పుడు రోజా స్పీడ్ తో సొంత పార్టీ నేతలను కూడా ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నారు.

తాజాగా నంద్యాలలో కానీ విజయవాడలో కానీండి గడచిన రెండు రోజులుగా రోజా చేసిన వ్యాఖ్యలు బాగా వివాదాస్పదమయ్యాయి. అఖిల కట్టుబొట్టుపై రోజా చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అభ్యంతరకరమే. ఒక మహిళగా ఉండి మరో మహిళ కట్టుబొట్టును విమర్శించాల్సిన పనేలేదు. పైగా అఖిల ప్రియ డ్రస్ సెన్స్ ఎప్పుడూ అభ్యంతరకరంగా లేదన్న విషయం గమనించాలి. చీర కట్టుకుంటుందా? డ్రస్సులేసుకుంటుందా అన్నది పూర్తిగా అఖిల స్వంత విషయం. అదే సమయంలో సినిమాల్లో ఉన్నపుడు రోజా వేసిన డ్రస్సుల గురించి అందరికీ తెలిసిందే.

తాజాగా టివి షోల పేరుతో రోజా వేస్తున్నస్టెప్పులు అభ్యంతరంగా ఉన్నాయి. అయినా వాటిని రోజా సమర్ధించుకుంటున్నారు. మరి తన విషయాన్ని సమర్ధించుకుంటున్న రోజా మంత్రి అఖిలను ఎలా తప్పుపడతారు? అఖిల విషయంలో రోజా చేసిన వ్యాఖ్యల కారణంగానే వైసీపీ అధ్యక్షుడు జగన్ సోదరి షర్మిల, భార్య వేపుకునే డ్రస్సులను నెటిజన్లు  సోషల్ మీడియాలోకి లాగుతున్నారు. రోజా, అఖిల కట్టుబొట్టుపై వ్యాఖ్యలు చేయకపోతే నెటిజన్లు జగన్ కుటుంబాన్ని సోషల్ మీడియాలోకి లాగే అవకాశం ఉండేది కాదు.

ఇక, చంద్రబాబునాయుడుపై రోజాకున్న అక్కసంతా ప్రతీ సందర్భంలోనూ తీర్చుకుంటున్నారు. తన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. రావణాసురుడని, కలియుగ యముడంటూ హద్దుల్లేని విమర్శలు చేస్తున్నారు. ప్రత్యర్ధిని వ్యక్తిగతంగా దూషించటాన్ని ఎవరూ సమర్ధించరన్న విషయాన్ని రోజా గుర్తించాలి. విధానపరంగా ఎంత విమర్శించినా ఎవరూ అభ్యంతరాలు చెప్పరు. జనాల్లో రోజా అంటే ఓ క్రేజుంది. దాన్ని తన నోటి దూలతో చెడగొట్టుకో కూడదన్న విషయాన్ని రోజా ఎంత తొందరగా గ్రహిస్తే వైసీపీకి అంత ప్లస్ అవుతుంది.  

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Naidu Speech | సెమీ క్రిస్మస్ వేడుకల్లో చంద్రబాబు నాయుడు | Asianet News Telugu
Kandula Durgesh Super Speech: ప్రతీ మాట ప్రజా సంక్షేమం కోసమే మాట్లాడాలి | Asianet News Telugu